ఏపీపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్ విడుదల..
మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుసగా నోటిఫికేషన్స్ ని విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హార్టికల్చర్ సర్వీస్‌లో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించింది ఏపీపీఎస్‌సీ. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… దీని ద్వారా మొత్తం 39 ఖాళీలను భర్తీ చేస్తోంది.
ఈ పోస్టులకు 2021 నవంబర్ 2 లోగా దరఖాస్తు చేయాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్ సబ్జెక్ట్‌తో నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్ పాస్ కావాలి. ఇక వయస్సు అయితే 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు వుంది.
ఇక పోస్టుల వివరాల లోకి వస్తే… మొత్తం ఖాళీలు 39 ఉండగా…జోన్ I (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు) 5, జోన్ II (తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు) 13, జోన్ III (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) 11, జోన్ IV (చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాలు) 10.
అప్లై చేసుకోవాలని అనుకునే వారు రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక అయినా వారికి రూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130 వేతనం లభిస్తుంది. https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోండి.