వ్యాక్సిన్‌కు నెలరోజుల దూరంలో ఉన్నాం: యూపీ సీఎం యోగి

కేవలం ఒక నెల రోజుల్లో కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ”మేం కొవిడ్ -19 వ్యాక్సిన్‌కు ఒక నెల దూరంలో ఉన్నాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మహమ్మారి ఉంది… అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కరోనా మరణాల రేటు సుమారు 8 శాతం నమోదు అయింది, అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తో మరణాల శాతం 1.04 మాత్రమే”అని ఆదిత్యనాథ్ చెప్పారు.

గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో జరిగిన ‘హెల్దీ ఈస్టర్న్ ఉత్తర ప్రదేశ్’ డ్రైవ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. కొవిడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమను ప్రశంసించిందని, దీనిపై పరిశోధలు జరగాలని సీఎం కోరారు.”టీమ్ వర్క్ ఎల్లప్పుడూ మంచి ఫలితాన్ని సాధిస్తోంది, ఎయిమ్స్ వంటి వైద్య సంస్థలు ఈ విషయంలో తమ పాత్రను గ్రహించాలి. కార్యరంగంలో ఎయిమ్స్ మరిన్ని పరిశోధనలు చేయాలి అని సీఎం సూచించారు.