వై.సి.పి భూదందాపై యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో దుమ్ములపేట ప్రాంతంలో గంధ నూకరాజు ఆధ్వర్యంలో కాకినాడ సిటిలో వై.సి.పి భూదందాపై యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ అనాదిగా ఈ కుంభాభిషేకం ప్రాంతం స్థానిక మత్స్యకారులకు కేంద్రంగా ఉందనీ, అలాంటి ప్రాంతాన్ని స్థానికుల అభిప్రాయాలకు భిన్నంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడం అంటే ఒకరకంగా వారి గొంతు కోయడమే అన్నారు. ద్వారంపూడిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ అయిదు సంవత్సరాలలో మీరు చేసిన దోపిడీలకి ప్రత్యక్ష సాక్ష్యమే నేడు ఈకుంభాభిషేకం రేవు అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు శంఖుస్థాపనలు చేసిన స్థలాన్ని కూడా పోర్టుకి అందచేసిన మనిషివి నువ్వు అన్నారు. దుమ్ములపేట వాసులని మోసం చేసిన మనిషిగా చరిత్రలో నిలిచిపొతావన్నారు. సుమారు 500ల కోట్లతో టి.డి.ఆర్ బాండ్లు ఇప్పించావే మరి దుమ్ములపేటలో ఉన్నవారికి కూడా ఇప్పించవచ్చుగా, ఇక్కడున్న వాళ్ళని కొమరిగిరికి పంపించేస్తున్నారు మరి అదే టి.డి.ఆర్ బాండ్లు వీళ్ళకీ ఇప్పించాలిగా అని ప్రశ్నించారు. అలాగే కాకినాడ కుంభాభిషేకం మా హక్కు అన్న దుమ్ములపేట వాసులకోసం జనసేనపార్టీ యుద్ధం చేయబోతోంది అంటూ, జనసేనపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కట్టిన గోడని తీసేసి వీరందరికీ ఇక్కడ రేవు అభివృద్ధిచేస్తామన్నారు. కాకినాడలోనే అతిగొప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసి అభివృద్ధి చేసే విధంగా జనసేనపార్టీ బాధ్యత తీసుకుంటాదన్నారు. పవన్ కళ్యాణ్ గారు లోగడ ఏటిమొగలో పర్యటిస్తున్నప్పుడు మత్స్యకారుల అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా అని చెప్పడం జరిగిందనీ ఈవేళ దుమ్ములపేట వాసులకు ఒక్కటే చెపుతున్నాం ద్వారంపూడి కాలరాసిన మీహక్కుల్ని మీకు తిరిగి జనసేనపార్టీ ఇస్తాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్, జనసేన నాయకులు మోస ఏసేబ్,దాసరి వీరబాబు, కొండు దుర్గాప్రసాద్, మారుపిల్లి సతీష్, కోమటి దుర్గాప్రసాద్, దాసరి ఎల్లాజీ, మారుపిల్లి చినా తదితరులు పాల్గొన్నారు.