పేర్రాజుపేట ప్రాంతంలో మేము సిద్ధం కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో పేర్రాజుపేట ప్రాంతంలో విముక్తి కోలనీలనీ సందర్శన మరియు సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ ఆధ్వర్యంలో మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అంటే ప్రజాక్షేత్రంలో ఉండి, ప్రజలకూ, ఆప్రాంతానికి ఏమి చేయాలి అన్న అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వంలో ఉండడం ఒకబాధ్యత అయితే కాకినాద అభివృద్ధిలో కూడా జనసేన బాధ్యత తీసుకోబోతోందన్నారు. ఈనాడు చూస్తే ఈ విముక్తి కాలనీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక డంపింగ్ యార్డు లాగ ఈప్రభుత్వం మార్చేసినదనీ, ఆనాడు 1978 సంవత్సరంలో మా నాయనమ్మగారు ఈ కోలనీలో ఆసుపత్రి కట్టించడం, ఆతరువాత ఏ.ఎం.జి వారు, పిమ్మట నాన్నగారు ముత్తా గోపాలక్రిష్ణ గారు ఈప్రాంతంలో అభివృద్ధి చేయడం జరిగిందన్నరు. తరువాత దీనిని అశ్రద్ద చేయడమే కాక దారుణమైన స్థితికి తేవడం హేయమని, వచ్చే ఎన్నికలు పూర్తయాకా జనసేన తరపున ఇక్కడున్న 150 కుటుంబాలకు నేడు మాట ఇస్తోందనీ దీనిని కాకినాడలోని జన్మభూమి పార్క్ & రాజా ట్యాంక్ లను మించిన అభివృద్ధిని ఇక్కడ చేసి చూపిస్తామన్నారు. మానవతా దృక్పధానికి అధికారం తోడైతే అద్భుతాలు సాధ్యం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశంతో ఈ వై.సి.పి ప్రభుత్వ అరాచక పాలనపై యుద్ధనికి జనసేనపార్టీ సిద్ధం అన్నారు. రానున్నరోజులలో జనసేనపార్టీ ప్రతి ప్రాంతాన్నీ సందర్శించి ఆ ప్రాంతాన్ని ఏమెమి అభివృద్ధి చేయబోతామో చెపుతామనీ ముందుగా ఇక్కడనుండీ మొదలెట్టామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన సెక్రెటరీ తలాటం సత్య నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.