సర్పంచుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

  • పాడేరు జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సర్పంచులు అమరావతిలోని కమిషనర్ కార్యాలయ ముట్టడిని నిర్వీర్యం చేసిన పోలీసుల తీరును పాడేరు జనసేన నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విధానాననికి శాంతియుతంగా చేస్తున్నటువంటి ఉద్యమానికి విరుద్దంగా ప్రవర్తించిన విధానం పూర్తిగా గర్హనీయం. ప్రభుత్వ పాలకుల నిరంకుశ వైఖరికి ఇది పరాకాష్టగా పేర్కొనవచ్చు. సర్పంచులు తమకున్నటువంటి హక్కులను కాపాడుకునే దాంట్లో భాగంగానే వారు కమిషనర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా సర్పంచులను అరెస్టు చేయడం ఇక్కడే వైసిపి ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడిందని ప్రజలందరికీ ప్రభుత్వ నియంతృత్వ పాలన అర్థమైంది. కావున జనసేన పార్టీ తరఫున ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పంచాయతీల సంబంధించినటువంటి నిధులను 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం కాజేసినటువంటి ఈ సొమ్మును ఇప్పటికైనా సర్పంచుల ఖాతాలో జమ చేసి, పంచాయితీ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచ్ లకి తగిన గౌరవం ఇచ్చేవిదంగా ప్రభుత్వ తీరు ఉండాలని డిమాండ్ చేసారు. పంచాయతీ అభివృద్ధికి మౌలిక సదుపాయాలకి ఉపయోగించేటటువంటి సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి రాజకీయ లబ్ధికోసం ఉచిత పథకాలకు మళ్లించి నేడు గ్రామాల అభివృద్ధిని నిర్వీర్యం చేస్తూ ఈ సొమ్మునంతా వైస్సార్ పార్టీ రాజకీయవసరాలకు ఉపయోగించుకోవడం శోచనీయం ఇది చట్టరీత్యా నేరం. దీనిని జనసేన పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, అలాగే సర్పంచుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం దారి మళ్లించి కాజేసిన సొమ్మును తక్షణమే పంచాయతీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అడ్వకేట్ చింతపల్లి కిల్లో రాజాన్, జనసేన మండల అధ్యక్షులు బుజ్జిబాబు, మండల నాయకులు వంతల ఉల్లి సీతారాం తదితరులు పాల్గొన్నారు.