జనసైనికులకు కష్టంలో తోడుగా ఉంటాం

గజపతినగరం నియోజకవర్గం: జామి మండలం, లొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నేల శేఖర్ అనే జనసేన క్రియాశీలక సభ్యుడు నిన్న ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి పడిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గజపతినగరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ మర్రాపు సురేష్, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన ఆయన్ని కలిసి పరామర్శించడం జరిగింది. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 వేల రూపాయలు ఆయనకు సహాయంగా ఇవ్వడంతో పాటు, గతంలో జామి మండల కో కన్వీనర్ జన్నెల బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం చేయడం ద్వారా పార్టీ పరంగా ప్రమాద బీమా రావలసిన 50000 రూపాయలకు అవకాశం ఉంటే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జామి మండల కన్వీనర్ పోతల రాంబాబు, కోకన్వీనర్ బాలకృష్ణ, గోవింద్, రామ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.