ప్రతీ గుండెకు జనసేనను చేరువ చేస్తాం: నేరేళ్ళ సురేష్

  • రాష్ట్రంలో మొదలైన జనసేన వేవ్
  • ఏప్రిల్ 2 నుంచి జనంలోకి జనసేన కార్యక్రమం
  • ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యే ఎండగడతాం
  • స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం
  • జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్

గుంటూరు అర్బన్, జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళేందుకు ఏప్రిల్ 2 నుంచి జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ తెలిపారు. ఆదివారం నగర పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జనసేన వేవ్ ప్రారంభమైందని ప్రతీ గుండెకు జనసేనను చేరువ చేయటమే లక్ష్యంగా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను, వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమం పేరుతో లక్షల కోట్లు అప్పులు చేయటమే కాకుండా అభివృద్ధిని పూర్తిగా ఆటకెక్కించిన వైసీపీ దుష్పరిపాలనపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు గోడప్రతులు, కరపత్రాలు నగరమంతా అతికించనున్నామని పేర్కొన్నారు. లక్షల కోట్లు అప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించటంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. స్థానిక సమస్యల పరిష్కారానికై ప్రజలతో కలిసి పోరాడతామని తెలిపారు. మచిలీపట్నం ఆవిర్భావ సభ తరువాత జనసేనకు అన్ని వర్గాలు ముఖ్యంగా బీసీలు, ముస్లింలు, దళితులు సానుకూలంగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంతో ఇన్నాళ్లు తమను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న రాజకీయ పార్టీలపై ఆ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయన్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలన్నింటిని కలుపుకొని రానున్న ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని సురేష్ అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షులు కొండూరి కిషోర్ కుమార్, చింతా రేణుక రాజు, ప్రధాన కార్యదర్శిలు యడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉదయ్, పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు.