శనివారపుపేటలో అట్టహాసంగా జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఏలూరు నియోజకవర్గంలోని శనివారపు పేటలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించుకున్న వారికి మండల ఉపాధ్యక్షులు సుందరనీడి వెంకట దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం నిరంతరం శ్రమించే జనసైనికులకు, వీరమహిళలకు క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఏర్పాటు చేశారు. దీనివలన జనసేనపార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే పార్టీ తరుపున వారికి రూ. 5 లక్షల సహాయం అందిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. దేశంలో మొట్టమొదట సారిగా 5 లక్షలతో ప్రమాద భీమా కార్యకర్తలకు అందించడం జనసేనపార్టీకే సాధ్యమన్నారు. అలాగే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏలూరు నియోజకవర్గంలో జనసేనపార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేనపార్టీ సిద్దాంతాలను ప్రతి ఇంటికి బలంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఏలూరు నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొణికి మహేష్, గెడ్డం చైతన్య, సుందరనీడి శివ శంకర్, తోట రాజేష్, తోట దుర్గా ప్రసాద్, జనసేన రవి, దారుగ చంద్రశేఖర్, బత్తుల రాంబాబు, ఎస్.కె.ఆదిల్, బీరం భాస్కర్, కృష్ణ, కర్రి మంగరాజు, జవ్వాది కృష్ణ, సగరం సాగర్, పేరిశెట్టి నాగేశ్వరరావు, యర్రంశెట్టి నంద గోపాల్, అడపా భాను, జవ్వాది నరేష్, వీర మహిళ కావూరి వాణి మరియు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.