ఎమ్మెల్యే ప్రసన్నకు లుంగీల ఫంక్షన్ చేసి .. మంత్రి కాకానిపై పంటలన్న సీరియల్ నిర్మిస్తాం: గునుకుల కిషోర్

  • లుంగీల పండుగ కోవూరు నియోజకవర్గంలో…… వంటలక్క కి పోటీగా పంటలన్న సీరియల్ సర్వేపల్లి నియోజకవర్గంలో….

నెల్లూరు: జనసేన పార్టీ కార్యవర్గంతో గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. తాను పెద్దమనిషిని అయ్యాను, లుంగీల పండుగ చేయండి నా పెద్దమనిషితనం గుర్తించండి, జగన్ నన్ను గమనించండి అనే తరహలో కోవూరు ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నాడని, ఎప్పుడు చూసినా పెళ్లిళ్లు శోభనాలు గురించి తన పెద్దరికాన్ని విస్మరిస్తున్నారనీ, ఉదయం లేచినప్పటి నుంచి పవన్ గారి నామ స్మరణ తప్ప అతనికి వేరే పని లేదని, కోవూరు నియోజకవర్గంలో భూకబ్జా, భూదందా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇసుక దోపిడీ తో విరివిగా సంపాదిస్తూ.. కోవూరు నియోజకవర్గంలో కొన్ని పల్లెల్లో స్మశాన వాటికకు వెళ్లేందుకు మార్గం కూడా అణువుగా లేక అవస్థల విషయం కూడా పట్టదు, పల్లెల కనెక్టివిటీ రోడ్లు అద్వానంగా ఉన్నా అతనికి ఏమి పట్టదు మళ్ళీ మేమే వస్తాం 175 కొడతాం జగనన్న సీఎం అని ఊరికే డబ్బాలు కొట్టడం తప్పిస్తే కోవూరు ఎమ్మెల్యే సాధించినది ఏమీ లేదన్నారు.

వంటలక్క కి కాంపిటేషన్ గా పంటలన్న సీరియల్:

అదేవిధంగా కిషోర్ మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో పంటల మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే లేచినప్పటి నుంచి పంటలు తెలుసా అనే ఇతని కోసం జనసేన పార్టీ తరఫున కొత్త సీరియల్ నిర్మించబోతున్నాం. వంటలక్క కి కాంపిటేషన్ గా పంటలన్న అనే సీరియల్ ని త్వరలో మేము అంతా నిర్మాణం చేపట్టబోతున్నాం. వీరు కూడా ఉదయం లేచిన నుంచి ప్రతిపక్షాల పైన పడటం తప్పిస్తే సాధించింది ఏమీ లేదు. ఎలక్షన్లప్పుడు చీప్ లిక్కర్ పంచి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన మీ వైఖరి సాక్షిగా ప్రజల మీకు త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. నిజంగానే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని బ్రాందీ షాపులు పెట్టడం మాకు తెలియదు.భూగర్భ జలాలు గురవుతున్న చోద్యం చూస్తున్నట్టు ఊరుకోవడం తెలియదు. కాలుష్యం కోరల్లో సర్వేపల్లి చిక్కుకున్నా తెలియదు. అన్నిటికంటే ముఖ్యమైనది మన కేసు తాలూకు ఫైలు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యాయ సంస్థ న్యాయ సంస్థల్లో కూడా ఫైల్ కు చోరీ గురి అవ్వడం,దానికి కారణం మీకు తెలియదు. వైసిపి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్న నాడు నేడు అనే కార్యక్రమం మీద స్కూల్లో నిర్మాణ ఆధునికరణకు పూనుకున్న ప్రభుత్వం పేదల విద్య కోసమా లేకపోతే స్థానిక వైసీపీ నాయకుల ఆర్థిక అభివృద్ధి కోసమా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది తెలియడం లేదు. ఎవరికి అందాల్సిన నిధులు దారులు మళ్లించి నాడు నేడు పనులు చేస్తున్నారు. పనులన్నీ దాదాపు పూర్తి అయ్యాయని ప్రగల్బాలుపోతున్న ఈ వైసీపీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాల గురించి ఖర్చుపెట్టిన నిధులు పూర్తయిన నిర్మాణాలు గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాను. పేద బీసీ విద్యార్థులకు ఇన్స్టిట్యూషన్స్ కి అందుతున్న ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల ఖాతాకే చేరవేస్తామని చెప్పి లేటు చేస్తుంటే యాజమాన్యం వారి హాల్ టికెట్లు ఆపుకుంటున్న పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా..?, ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు చూస్తే ఒకటవ తేదీ నుంచి 15వ తారీకు పారిపోయి మారిపోయిన ఎవరిని అడిగి మార్చారు, ఒకటి రెండు నెల మొదట్లో వారి అవసరాలను ఎవరు తీరుస్తారని అనుకుంటున్నారు.. ఎన్నో రకాల సమస్యలతో ఎదురీత సాగిస్తున్న మీ వైసీపీ పాలన ఎంతో కాలం సాగదు రానున్నది ప్రజా ప్రభుత్వమే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం మీరు చేసిన అక్రమాలను తప్పకుండా తగు చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను… అని కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, పూసల లక్ష్మీ మల్లేశ్వరరావు, కంథర్, అలేఖ్, అమీన్, రాజా, హేమంత్ యాదవ్, హరి, షాజహాన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.