వారాహి యాత్రను విజయవంతం చేస్తాం: డి.యం.ఆర్.శేఖర్

అమలాపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి విజయ యాత్ర బుధవారం అన్నవరంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం అమలాపురం నియోజకవర్గం గడియార స్తంభం వద్ద పార్టీ నాయకులు డి.యం.ఆర్.శేఖర్ ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. తొలుత ఈ గోడ పత్రికలకు స్థానిక వినాయకుని గుడి వద్ద పూజ నిర్వహించి, ఆవిష్కరించడం జరిగింది ప్రతి గ్రామంలోనూ ఈ గోడ పత్రికలు ఉండేలా కార్యాచరణ చేసినట్టు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా డి.యం.ఆర్ మాట్లాడుతూ వారాహి యాత్ర ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో పర్యటించేలా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూపొందించారని, తొలి విడతగా 11 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. రేపు కత్తిపూడిలో జరగబోయే తొలి వారాహి బహిరంగ సభకు అమలాపురం నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చేలా జనసమీకరణ చేస్తున్నట్లు డి.యం.ఆర్. తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, అర్.డి.యస్.ప్రసాద్, కౌన్సిలర్లు పడాల శ్రీదేవి నానాజీ, తిక్కా రాణి ప్రసాద్, డి.దుర్గా భవాని, యం.పి.టి.సీ లు మోటూరి వేంకటేశ్వర కనకదుర్గ, బట్టు పండు, డి.యస్.యన్.కుమార్, నల్లా చిన్ని, తిక్కా సరస్వతి, భగవాన్, గంగాబత్తుల కిషోర్, అల్లాడ రవి, జంగా లోవరాజు, కే.యస్.యస్. రూరల్ అధ్యక్షులు కానిపూడి రమేష్, అల్లవరం అధ్యక్షులు ఆర్.కె.నాయుడు, టౌన్ అధ్యక్షులు పోలిశెట్టి మహేష్, పిల్లా రవి, సాధనాల మురళి, బండారు వెంకన్న బాబు, గట్టెం వీరు, వీరమహిళలు కరాటపు వాణి, కర్రి లక్ష్మి, గంధం శ్రీను, కేశవ, సలాది కన్నా మరియు నాలుగు మండలాల నుండి అధిక సంఖ్యలో జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.