కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

– గుంటూరు జిల్లా, నగర అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నేరేళ్ళ సురేష్

  • 22వ డివిజన్ లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర నాయకులు నాయబ్ కమాల్, వడ్రాణం మార్కండేయ బాబు

జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమ శక్తికి మించి శ్రమిస్తున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జనసేన పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నేరేళ్ళ సురేష్ అన్నారు. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో శనివారం 22వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసరావుతోటలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గాదె, నేరేళ్ళ మాట్లాడుతూ ఇంతకాలం అన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తల్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకొని వదిలేసేవారని, జనసేన మాత్రం కార్యకర్తలకి ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటుందన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది అని అలాంటిది జనసేన పార్టీకి క్రియాశీలక కార్యకర్తలే ఐదు లక్షలు వరకు ఉన్నారంటే పార్టీ ఎంత బలోపేతంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చన్నారు. క్రియాశీలక సభ్యత్వాల్లో జిల్లాను ప్రధమ స్థానంలో ఉంచేలా జనసైనికులు కృషి చేయాలని గాదె, నేరేళ్ళ కోరారు. రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకులు నాయబ్ కమాల్ మాట్లాడుతూ జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. మరో రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఇప్పుడు జనసేన గ్రాఫ్ ఎంతో పెరిగిందని, ఈ నేపధ్యంలో క్రియాశీలక సభ్యత్వాలు రికార్డ్ స్థాయిలో నమోదు అయ్యే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజా పోరాటాలకు, ఉద్యమాలకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించటం ఎంతో ముదావహం అన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్, దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావులు తమ క్రియాశీలక సభ్యత్వాలను రెన్యూవల్ చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, నగర పార్టీ కార్యదర్శిలు బండారు రవీంద్ర, బాషా, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, బాలకృష్ణ, శానం రమేష్, నాయకులు రామిశెట్టి శ్రీనివాస్, చెన్నా పోతురాజు, కోనేటి ప్రసాద్, సయ్యద్ రఫీ, వడ్డె సుబ్బారావు, సెంట్రింగ్ వెంకటేశ్వరరావు, పుల్లంసెట్టి ఉదయ్, రాష్ట్ర రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్, పులిగడ్డ గోపి, కోలా అంజి, నండూరి స్వామి, శేషు, బాషి, బాలయ్య, శెట్టి శ్రీను, గోపిశెట్టి రాజశేఖర్, సురేష్, కోటేశ్వరరావు చిరంజీవి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, మీడియాతో మాట్లాడుతున్న గాదె, నేరేళ్ళ, వడ్రాణం, నాయబ్ కమాల్