కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు ఏం చేశారు?: నల్లల రత్నాజీ

పాయకరావుపేట: కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకి ఏం చేశారని నక్కపల్లి మండల జనసేన నాయకులు నల్లల రత్నాజీ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యుఎస్ కేటగిరిలో ఇచ్చిన రిజర్వేషన్ను సచివాలయం ఉద్యోగ నోటిఫికేషన్ లో అమలు చేయకపోవడం వల్ల 13,000 మంది కాపు యువత భవిష్యత్తు పోయింది ఇటీవల కేంద్రం ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చుకొచ్చని తెలిపింది కానీ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని మీ నాయకులను ప్రశ్నించడం లేదని డిమాండ్ చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న రాయవరం మండలంలోని కొంతమంది కాపులకు గతంలో తూర్పు కాపులుగా గుర్తించి బీసీ డి సర్టిఫికెట్ లు ఇవ్వడం జరిగింది. మరి మీరెందుకు మీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో బీసీ డి సర్టిఫికెట్ లు ఇప్పించలేకపోతున్నారు అని అన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి లోన్ లు మరియు విదేశీ విద్య అందించారు అని ప్రశ్నించారు. కాపు యువతే కాదు రాబోయే రోజుల్లో బీసీ, యస్ సి, యస్ టి, మైనార్టీ యువత పవన్ కళ్యాణ్ గారికే మద్దతు తెలుపుతారన్నారు.