అదాల గారు మా పల్లెకు రోడ్లెప్పుడు

నెల్లూరు: శంకుస్థాపన హోరు పెంచిన వైసిపి ఎంపీ అదాల గారు.. పనులు జోరు ఎప్పుడు.. మా పల్లెకు రోడ్లెప్పుడు.. అంటూ నెల్లూరు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నెల్లూరు రూరల్ కందమూరు జంక్షన్ వద్ద వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్ద ఆదివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ లో శిలాఫలకాలు జోరు పెరిగింది ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు చేస్తున్నామంటూ వైసీపీ ప్రచారం సాగుతుంది. నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి పనులకు దూరంగా ప్రజలను ఇబ్బందులు పెట్టిన ఈ వైసిపి ప్రభుత్వం. ఎన్నికలు సమీపించడంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామంటూ తెగ తిరుగుతున్నారు. దాదాపు 18 గ్రామాల్లో 80% కూడా రోడ్ల రోడ్ల సౌకర్యం సరిగా లేదు. నెల్లూరు ఎంపీ, వైసిపీ రూరల్ ఇన్ చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ నగర్, శ్రామిక నగర్ లో పాతిక లక్షల రూపాయలతో రోడ్డు వేయడానికి కార్పొరేషన్ లో నిధులు లేవు. అలాగే గ్రామాలకి ఏదైనా అభివృద్ధి చేస్తామంటే గ్రామనిధులు లేవు. జిల్లా మొత్తం కూడా ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియా అక్రమంగా పెతందారులు దోచుకు తింటున్నారు. వీటన్నింటి ఆపాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రామాల నుంచి ఆదాయం సంపాదించుకొని పెత్తందారులు పెద్దవారవుతున్నారే గాని.. గ్రామాల అభివృద్ధికి నోచుకోవడం లేదు. సహజ వనరులు దోపిడీ జరుగుతుంది ఇది ఒక అన్యాయమైతే.. ఆ వనరులు దోచుకుని రెవిన్యూ కూడా గ్రామాల అభివృద్ధి చేయకపోవడం మరింత దారుణం. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎంపీగా వీటిని అరికట్టి రెవిన్యూని ప్రభుత్వానికి చేర్చి మన గ్రామాలను అభివృద్ధి పరచాల్సిన పరిస్థితికి ఖచ్చితంగా ఉంది. కార్పొరేషన్ లో ఉన్న కొన్ని డివిజన్లు అలాగే 18 గ్రామాలు స్థానిక మౌలిక వసతులు లేక మగ్గుతున్నాయి. ఇక నాలుగు నెలలు మిగిలి ఉన్నాయి శిలాఫలకాలు ఆపి అభివృద్ధి పనులు చేపట్టాల్సిందిగా నేను తెలుపుతున్నాను. జనసేన పార్టీ తరఫున ప్రజా ఉద్యమమే చేస్తున్నాము. కనీస వసతులు కల్పించలేని వైసీపీ ప్రభుత్వం ను తరిమి కొట్టవలసిందిగా ప్రజలను కోరుతున్నాము. గ్రామాల అభివృద్ధి, సహజ వనరుల సంరక్షణ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. అందువలన ప్రజా ప్రభుత్వాన్ని జనసేనకి అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా మనవి చేశారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్గౌడ్, వర్షన్, కేశవ, మౌనిష్, కందమూరి గ్రామ వాస్తవ్యులు పాల్గొన్నారు.