రాష్ట్ర ప్రయోజనాలకోసం జనసేనకు అవకాశం ఇవ్వండి: గునుకుల కిషోర్

  • ఎన్నికలు దగ్గర పడేసరికి శంకుస్థాపనలు ఊపందుకున్నాయి.. గునుకుల ఆధ్వర్యంలో పాదయాత్ర

నెల్లూరు: ఎన్నికలు దగ్గర పడేసరికి శంకుస్థాపనలు ఊపందుకున్నాయి.. అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో మినీ బైపాస్ జ్యోతిరావులే బొమ్మ వద్ద నుంచి బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు మీదగా సంక్రాంతి సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టుల తాలూకు బకాయిలు చెల్లించక రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులు అంటేనే భయపడే పరిస్థితుల్లో దేని నుంచి నిధులు మళ్లించి వైసిపి నాయకులకు కొత్త కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా ఒకసారి జనసేనకు అవకాశం ఇవ్వండి. రాష్ట్ర ప్రజల కోసం ఆచి తూచి అడుగులు వేస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ సారి ఒక అవకాశం ఇచ్చి గాజు గ్లాస్ కి ఓటు వేయండి. ఉదయం లేచిన వద్ద నుంచి ప్రతిపక్షాలపై నోరు పారేసుకుని అడ్డగోలుగా మాట్లాడడం తప్పిస్తే వైసిపి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. రాష్ట్రంలో శంకుస్థాపనలు ఊపందుకున్నాయి, ఎన్నికలు దగ్గర పడటంతో కనీసం జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు శంకుస్థాపన చేపడుతుంది. గత ప్రభుత్వం లో చేసిన కాంట్రాక్ట్ తాలూకు మొత్తమే చెల్లించలేక, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంట్రాక్టు చేయాలంటే భయపడే పరిస్థితుల లో ఏ నిధులను మళ్లించి వైసీపీ నాయకుల కు కాంట్రాక్టులు కట్టబెట్టారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం గ్రావెల్, ఇసుక, అక్రమ లేఔట్ రూపంలో నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు. విద్య వైద్య రంగాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో చేసుకొని మెరుగైన విద్య వైద్యం పూర్తిగా అందజేసే విధంగా చర్యలు చేపట్టాలి, ఎవరి ఆసరాతో చేపట్టడం సరికాదు. గత రెండు రోజులుగా జనసేన కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులు,ఇరుగుపొరుగు వారు బంధుమిత్రులని సంప్రదించి ఈ సారి జనసేన పార్టీ కి ఓటు వేసే విధంగా మద్దతు కోరడం జరుగుతుంది. కోట్లాదిమంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఓటును బూతు దాకా తీసుకెళ్ళే విధంగా అధినేత నిర్ణయం ఏదైనా కూడా దానిని అనుసరిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో నిర్మల, ప్రశాంత్ గౌడ్, అమీన్, హేమంత్ యాదవ్, చిన్న రాజా, వయర్షన్, తరుణ్, మౌనిష్, ప్రసన్న, ప్రతాప్, బాలు, మల్లి, విజయ్, తదిరులు పాల్గొన్నారు.