గడిబిడి అమర్నాథ్ కు, జగన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత భయం?: వంపూరు గంగులయ్య

పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్ రెడ్డికి, ఈ గడిబిడి అమ‌ర్నాథ్ కి ఎందుకంత భయమని జనసేన అరకు పార్లమెంట్ ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన మంత్రి అమరనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పాడేరులో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పై విమర్శలు చేసే స్థాయి అమర్నాథ్ కి లేదని ఆయన ఎద్దేవా చేశారు. మీరు పెద్ద సెలబ్రిటీస్ అని మీరే చెప్పుకుంటున్నారు.. ఎప్పుడు సెలబ్రేటీ అయ్యావు అని ఆయన ప్రశ్నించారు. మీతో పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు దిగేందుకు ఆరాటపడ్డారని మీరు చెప్పడం వెనుక ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఒకసారి మీరుగా.. ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. మీకైతే మంత్రి పదవి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని మీది ఆ స్థాయి కాదని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ తో ఒక ఫోటో దిగడానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో సిఫార్సు చేయించుకున్న మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఎక్కడ వచ్చిందని ఆయన నిలదీశారు. మీరు, మీ తల్లి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన విషయం మరిచిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మీరు దత్తపుత్రుడా? మేమా అని నిలదీశారు.

గడిబిడి అమర్నాథ్..

గుడివాడ అమర్నాథ్ పేరును గడిబిడి అమర్నాథ్ గా మార్చుకుంటే మంచిదని గంగులయ్య సూచించారు. అమర్ మాటలకు అసలు విలువ లేదని గడిబిడి తప్ప ఏమి ప్రయోజనం లేదని ఆయన అన్నారు. అనకాపల్లి ప్రజల సాక్షిగా ఎన్నికల సమయంలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ని తిరిగి తెరిపిస్తావస్తామని మీరు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు మీ గవర్నమెంట్ స్వయంగా ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు ప్రకటన చేయడం వెనక మీ అసమర్థతకు కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. చేతనైతే దానిమీద ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండని అప్పుడు ప్రజలు హర్షిస్తారని ఆయన చెప్పారు. అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయాన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేక పోయారని ఆయన నిలదీశారు. జిల్లా ఆస్పత్రిగా పేరుమార్చినంత మాత్రాన జిల్లా ఆస్పత్రి అయిపోయినట్టేనా అని నిలదీశారు.
వైద్యుల కొరత, వైద్య పరికరాల కొరత, మిగతా సమస్యల పరిష్కారం చేయనక్కరలేదా అని అన్నారు. ఇది ఒకటి మాత్రమే కాదు మీ అనకాపల్లి నియోజకవర్గంలోని అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయండని, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల మీ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని మీరు మొదటి గుర్తించాలని జనసేన అరకు పార్లమెంట్ ఇన్చార్జి వంపూరు గంగులయ్య సూచించారు.