పార్టీ బలోపేతానికి అహర్నిశల కృషి చేస్తా: డా విష్వక్సేన్

ఎచ్చెర్ల నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తూ నాకు ఇచ్చిన ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన సమన్వయకర్త పదవిని త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని డా విష్వక్సేన్ తెలియజేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్య సయోధ్య కుదిరించి నియోజకవర్గ సమస్యలపైన కలిసి పోరాడే విధంగా మరియు పార్టీ బలోపేతానికి అహర్నిశల కృషి చేస్తానని తెలియజేసుకుంటూ. డా విష్వక్సేన్ గారు మాట్లాడుతూ జనసేన – టీడీపీ ఉమ్మడి కార్యాచరణతో భవిష్యత్తు గ్యారెంటీ అనే డాక్యుమెంట్ 10 పాయింట్స్ మేనిఫెస్టోతో నవంబర్ 17వ తేదీ నుంచి నియోజకవర్గంలో మొదలుపెడుతున్నాము. అలాగే 18,19 తేదీలు నియోజకవర్గంలో రోడ్లు గుమ్ములుగా మారడంతో డిజిటల్ క్యాంపెయిన్ ఉభయ పార్టీలు కలిసి చేయబోతున్నాము. అలాగే ఓట్లను నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో తొలగించడం జరిగింది. ఈ 15 రోజుల్లో తెలుగుదేశం – జనసేన పార్టీ కలిసి పంచాయతీ లో ఓటర్ల జాబితా పరిశీలించడం జరుగుతుంది. 2024లో ఎచ్చెర్ల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే 30,000 వేల ఓట్లు మెజారిటీతో గెలుస్తాము అని డా విష్వక్సేన్ మీడియాతో స్పష్టంగా చెప్పారు‌. ఈ అవకాశం నాకు ఇచ్చిన పార్టీ పెద్దలుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే నియోజకవర్గ ప్రజలకు నా వెంట ఉండే నడిపించిన నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, లావేరు మండల అధ్యక్షులు బార్నాల దుర్గారావు, వడ్డాది శ్రీనివాసరావు, బలరాం, కాకర్ల బాబాజీ, కోల రాజేష్, ద్వార రాజా రమేష్, మీసాల నాయుడు, పవన్ కళ్యాణ్, సత్య, కోటి, సంతు నాయకులు పాల్గొన్నారు.