ఎన్డీఏ కూటమిని గెలిపించండి: దాసరి రాము

నరసాపురం: ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు అవుతాయని బలిజ కాపు సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము అన్నారు. సోమవారం పట్టణంలోని జనసేన కార్యాలయంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి రాము మాట్లాడుతూ సంపద సృష్టించకుండా అప్పులు చేసి పథకాలు ఇస్తూ పోతే రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకు పోతుందన్నారు. వైసిపి చేతకాని విధానాల వల్ల రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులు ఊబిలో కూరుకుపోయిందన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదని, ఉపాధి లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి తలైతుందన్నారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి వైసీపీ నాయకులు వేల కోట్లు దండుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మారాలంటే రానున్న ఎన్నికలలో కూటమిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం బిజెపి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ను గెలిపించాలని కోరారు. అన్ని వర్గాలకు అండగా జనసేన నిలుస్తుందన్నారు. ఎక్కడ చుట్టుపక్క రాష్ట్రాలలో దొరకని మందు బ్రాండ్లు ఏపీలో దొరుకుతాయి అన్నారు. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.జనసేన పార్టీ అధికారం కోసం వచ్చిన పార్టీ కాదు, సేవ చేయడం కోసం వచ్చిన పార్టీ అన్నారు. పేద కులాలు నుండి వచ్చిన పార్టీ జనసేన అన్నారు. వ్యతిరేక ఓట్లు చీల కూడదని టీడీపీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుందన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళి కృష్ణ పిఠాపురం లో నెగ్గేది పవన్ కళ్యాణ్ అని, పవన్ భారీ మెజారిటీతో గెలుపొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వర్ధనపు ప్రసాద్, మాదాసు కోటేశ్వరరావు గుబ్బల మార్రాజు, పోలిశెట్టి నళిని తదితరులు పాల్గొన్నారు.