ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు: దారం అనిత

నాలుగు నెలల గర్భిణీ అయిన ఎస్సీ మహిళను, భర్తను కొట్టి తన వద్ద వున్న 750 నగదును లాక్కొని భర్త, ముగ్గురు పిల్లల ముందే రైల్వే ప్లాట్ ఫారం పై ఆదమరచి నిద్రిస్తున్న మహిళపై కామాంధులు రెచ్చిపోయి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు..

కూలి పనుల కోసం మరో ప్రాంతానికి వెళ్తూ మార్గమధ్యంలో రేపల్లె స్టేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్న 25 సంవత్సరాల దళిత మహిళపై భర్త ముందే పాశవిక చర్యకు పాల్పడ్డారు..

ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడగా.. మరొకరు ఈ దారుణానికి సహకరించారు. బాదితురాలి భర్త తనను నిర్బంధించిన వ్యక్తి నుండి తప్పించుకుని అక్కడే ప్లాట్ఫారం పై ఉన్న రైల్వే పోలీసు కార్యాలయం వద్దకు వెళ్లి ఎంతగా ప్రాధేయపడినా అతని ఆక్రందనను విని ఒక్కరంటే ఒక్కరు స్పందించలేదు ..

రైల్వే స్టేషన్ బయట ఉన్న తోటి ప్రయాణికులు, రిక్షా కార్మికులను సాయం చేయమని కోరినా ఎవరూ ముందుకు రాలేదు. దగ్గర్లోనే పోలీస్ స్టేషన్ లో చెప్పడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేసారు..

రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు భద్రత లేదు.. దిశా చట్టం అసలే లేదు.. జరగరాని ఘోరం జరిగాక అందిస్తున్న ప్రభుత్వ మంత్రులు ముందుగానే ఎందుకు భద్రత కల్పించే బలమయిన చట్టాలు రాష్ట్రంలో ఎందుకు తీసుకురాలేదని చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శిదారం అనిత ప్రశ్నించారు.