ప్రత్తిపాడు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ప్రత్తిపాడు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) నివాసం శంఖవరం మండలం, కత్తిపూడిలో జనసేన పార్టీకి ఎనలేని కృషి చేస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గ వీరమహిళామణులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి, వీరమహిళలు శ్రీమతి దలే జ్యోతి, ఉమ్మిడి వెంకటలక్ష్మీ, అడపా చందన, కందా గంగాభవానిలకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండలం పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, కత్తిపూడి జనసేన నాయకులు సత్తి వీర్రాజు, చిన బాబి, ప్రత్తిపాడు జనసేన నాయకులు లాజర్, అమరాది శివ, ఆసిన బాలాజీ, అడపా తమ్మయ దాసు, కోలా నాగ్, నిర్జ నాగ్, షేక్ సలీమ్, మధు, త్రినాద్ మరియు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.