జనసేనతోనే మహిళా సాధికారత: కోన తాతారావు

గాజువాక నియోజకవర్గ మహిళా సదస్సు శనివారం గాజువాకలో నియోజకవర్గ ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సులో కోన తాతారావు మాట్లాడుతూ ఎన్నికలు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ, చేయూత, కార్పొరేషన్ల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించికొని అధికారంలోకి వచ్చాక. వైసిపి ప్రభుత్వం వాటి జాడే లేకుండా వారిని మోసం చేసిందాన్నారు. జనసేనపార్టి స్త్రీ జాతి స్వేచ్చ, సమానత్వం, హక్కులు సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య, రాజకీయ రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సమాజంలో మహిళల గౌరవం పెంచుతామన్నారు. పార్టీ కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తామని వీరు పార్టీకి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు గడసాల అప్పారావు, కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డి, తిప్పల రమణారెడ్డి, దాసరి జ్యోతి రెడ్డి, మాకా షాలిని, తోట ఇందిరా ప్రియదర్శిని, పత్తి రామలక్ష్మి, దాసరి తులసి, మహేశ్వరీ, గెడ్డం గౌరీ, ఆదిలక్ష్మి, శంకరమ్మ, పేర్ల రమా, దుర్గ, అనురాధ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.