సార్వత్రిక ఎన్నికల కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయండి!

  • జనసేన చిన్నపాల్ తో నాగబాబు

విజయవాడ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ కె.చిన్నపాల్’తో మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నాగబాబును ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పాకనాటి గౌతంరాజుతో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనకు అంతం పలకాలంటే జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త పనిచేయాల్సిందేనని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడిని, కార్యకర్తను పార్టీ గుర్తు పెట్టుకుని తగిన ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుందని అన్నారు. రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమని తద్వారా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి తనవంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి, వెలుగొండ ప్రాజెక్టు విషయంపై చిన్నపాల్ నాగబాబుతో తెలిపారు.