అక్రమ మైనింగ్ కు సూత్రదారి, పాత్రదారి గిరిజన ద్రోహి కుంభ రవిబాబు

  • నిమ్మలపాడు గ్రామస్తుల ఆరోపణ

అక్రమ మైనింగ్ కు సూత్ర దారి, పాత్ర దారి గిరిజన ద్రోహి కుంభ రవిబాబు నిమ్మలపాడు గ్రామస్తుల ఆరోపణ చేస్తూ అనంతగిరి జనసేన మురళి కు ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జనసేన మురళితో మాట్లాడుతూ వాలసి పంచాయతీ, నిమ్మలపాడు గ్రామ పరిసర ప్రాంతాలు కరకవలస రాళ్ల గరువు ప్రాంతాలలో అపార ఖనిజ సంపద కలిగి ఉంది ఎంతో విలువైన ఖనిజ సంపాదను దోసుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుత ఎస్టి కమిషన్ చైర్మన్ ఎం.ఎల్.సీ కుంభరవిబాబు సర్వ అధికారిక ఉపయోగించుకుని స్థానిక గిరిజన మహిళ దూరియా రుక్మిణి పేర్లుతో మైనింగ్ లైసెన్స్ పొంది. పలు అక్రమాలకు పడుతున్నారని ఆయా ఆయా గ్రామ ప్రజలు తీవ్రంగా ఆరోపించారు అలాగే మైనింగ్స ర్వే నంబర్లు ఈ విధంగా ఉన్నాయి. 29/1, 29/2, 33/5, 33/6, 34/1, 34/2, 34/3, 34/5, 34/6, 34/7 లలో మైనింగ్ తవ్వకాలు రువ్వుతూ గిరిజన సంపదలను దోచుకుపోతున్నారు. అయితే మైనింగ్ నిబంధనల ప్రకారం అపార ప్రాంత ప్రజలకు తగిన మౌలిక సదుపాయాలు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం వంటివి సౌకర్యాలు కల్పించవలసి ఉంది. అయితే మైనింగ్ లీజు పొందిన వ్యక్తులు అక్కడ ఎటువంటి సౌకర్యాలు నేటికీ కల్పించలేదు పైగా అక్కడ భూ హక్కు దారులను భయభ్రాంతులు చేయడమే కాకుండా త్రివ మైన నష్టం జరపారు అని ఆరోపించారు మాకు నష్టం జరిగి మాకు జరిగిన అన్యాయం పై రోడ్ ఎక్కితే కొంతమంది కుంభ రవిబాబు అనుచరులు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు అని గిరిజనులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కే ధర్మన్న జె పండన్న, ఎస్ లచ్చన్న, రాళ్లగరువు వార్డ్ నెంబర్ సిహెచ్ అప్పన్న, సిహెచ్ సోమన్న, సిహెచ్ రామన్న, సిహెచ్ కామరాజు, ఎస్ పండన్న, ఎస్ వెంకటస్వామి, సిహెచ్ వెంకట్రావు, పి సోమన్న, సిహెచ్ లచ్చన్న, ఎస్ ఆసన్న, నిమ్మలపాడు వార్డ్ నెంబర్ కే రామ్మూర్తి, వార్డ్ నెంబర్ ఎస్ రామ్మూర్తి, సిహెచ్ బాలన్న తదితరులు పాల్గొన్నారు.