బాధ్యతాయుతమైన కార్యకర్తగా పార్టీకోసం పనిచేస్తున్నా: జూమ్ సమావేశంలో కేతంరెడ్డి

  • జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో 10వ జూమ్ సమావేశం
  • పలు దేశాల నుండి జూమ్ సమావేశంలో పాల్గొన్న ఎన్నారై జనసేన నాయకులు మరియు వీరమహిళలు.

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో ఆ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి అధ్యక్షతన నెల్లూరు సిటీ జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. సురేష్ వరికూటి టీంని పరిచయం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారై జనసైనికులు అందరూ సంఘటితమై ఒక్క టీమ్ గా అందరూ కూడా కనెక్ట్ అవుతూ… మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనసేన లీడర్స్ తో కనెక్ట్ అవుతూ ఎన్నారై జనసేన నాయకులు మరియు వీరమహిళలు ప్రశ్నలు కావచ్చు, లోకల్ గా పనిచేస్తున్న కార్యకర్తల నుంచి ఇంపుట్ కావచ్చు, తెలుసుకొంటూ అవి పార్టీకి ఉపయోగపడేలా అనువర్తిస్తూ, ఇంకా మనం పార్టీని ఎంత బాగా ముందుకు తీసుకు వెళ్ళొచ్చనే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రవీణ్ జరుగుమల్లి నెల్లూరు నుంచే కావటం వలన కేతంరెడ్డి వినోద్ రెడ్డిని పరిచయం చేస్తూ వారు చేస్తున్న కార్యక్రమాలను సమావేశానికి వివరించి పరిచయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మట్లాడుతూ జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్తున్నారని వివరిస్తూ పార్టీని తల్లిగా భావిస్తూ… ఒక కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే తండ్రి పాత్ర ఎంత ముఖ్యమో అలానే రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం పదవి అంత ముఖ్యం అందువలన పవన్ కళ్యాణ్ ని ఒక తండ్రిలా భావిస్తున్నానని, అయనను ముఖ్యమంత్రిని చేయాలనే ఆశయంతో ఒక నాయకుడిలా కాకుండా బాధ్యతాయుతమైన కార్యకర్తగా మాత్రమే పార్టీకోసం పనిచేస్తున్నానని తెలిపారు. ఒక ఉదాహరణ తీసుకొని చెప్పాలి అంటే రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటది. రాజ్యం బాగుంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అందువలన ఒకమంచి లక్షణాలు కలిగిన మహారాజు లాంటి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ ని సీఎం చేసేంతవరకు నేను కృషి చేస్తూనే ఉంటానని అన్నారు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గ్రావిటీ ఉంటుందని అవి అన్ని తెలుసుకొంటూ పార్టీని, గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి ఎలా చేరవేయాలి అని ఆలోచించుకొంటూ ముందుకు వెళ్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా 200 రోజులుగా ఆయన చేస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని ఎన్నారై సభ్యులకు వివరిస్తూ, పవన్ కళ్యాణ్ 2019లో ఒక మాట చెప్పారు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడిక్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నానని. అది నాకు చాలా తృప్తిని ఇచ్చిన ఘట్టం అని అన్నారు. ఆలా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక పార్టీ నిర్మాణానికి నేను ఈరోజుకి కూడా బాధ్యతాయుత కార్యకర్తగా పనిచేస్తూ వెళ్తున్నాను, ప్రజలను కలుస్తూ వారితో అనుబంధాన్ని పెంచుకుంటూ, పర్యటిస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్నానని తెలిపారు. పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూసేందుకు ఒక రామసేతు బ్రిడ్జిని కట్టటానికి ఉడత ఏవిధంగా సహాయం చేసుకొంటూ వెళ్లిందో అలాగే నా వంతు ఉడతా భక్తి కార్యం చేసుకొంటూ వెళ్తున్నానని అన్నారు. బూత్ లెవెల్ మేనేజ్మెంటులో భాగంగా యూత్ కి ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. పలుదేశాల నుండి పాల్గొన్న జనసైనికులు ఆడిగిన ప్రశ్నలకు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సమాధానాలు చెప్పడం జరిగింది. కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎన్నారై జనసైనికులు ఆయనకు అభినందనలు తెలిపారు. కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రయాణంలో “జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ – ప్రపంచ ఎన్నారై కలయిక” తోడుగా ఉంటుదని తెలిపారు. ఈ సమావేశంలో కెన్యా నుండి ప్రవీణ్ మొగసాటి, యూకే నుండి పద్మజ రామిశెట్టి, నాగరాజు వడ్రాణం, అమల చలమలశెట్టి, వికాస్ దేశాది, శ్రీధర్ పివి, జర్మనీ నుండి సురేష్ వరికూటి, సుధాకర్ వరికూటి, రంగా దాసాని, చందు, సురింధర్ ఆవుల, పద్మజ నగరం, యూఏఈ నుండి ఇంద్రనీల్ రాజ్ ముప్పిడి, బెల్జియం నుండి ప్రవీణ్ జరుగుమల్లి, కృష్ణ చైతన్య, ఆస్ట్రేలియా నుండి హేమలత గాదిరెడ్డి, మురహరి నాయుడు గాజుల, ఫణిరాజ్, సౌత్ కొరియా నుండి డా.ప్రవీణ్ రాయల్, వంశీ, సేచిల్లిస్ నుండి రమేష్ సేపేన, సింగపూర్ నుండి గుంటూరు వంశీ మోహన్, యూఎస్ నుండి శ్రీధర్ పిల్లా, నీలిశెట్టి సురేష్ బాబు మరియు ఇండియా నుండి కొల్లా హనుమంతరావు, రత్న పిల్లా తదితరులు పాల్గొన్నారు.