వటపత్రశాయి అలంకారంలో యాదాద్రీశుడు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజైన శుక్రవారం.. స్వామి వారి అలంకార సేవ అత్యంత నయనానందంగా సాగింది. యదాద్రీశుడు వటపత్ర శాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామివారి అలంకారం బాలాలయంలో జరిగింది. అనంతరం మేళాలు, నాదస్వర చప్పుళ్లు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ అంగరంగ వైభవంగా ఉరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు పాల్గొన్నారు.