పెడన నియోజకవర్గంలో యడ్లపల్లి రామ్ సుధీర్ పర్యటన

పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం, లక్ష్మీపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ కనక_పెన్నమ్మ తల్లి జాతర మాహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మిపురం జనసైనికుల ఆహ్వానం మేరకు పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్, మరియు జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం ఛైర్మెన్, పి.ఏ.సి కమిటీ మెంబర్, నర్సాపురం ఇంఛార్జి బొమ్మిడి నాయకర్ తో కలిసి శ్రీ శ్రీ శ్రీ కనక పెన్నమ్మ తల్లి ఉత్సవాలలో పాల్గొన్నారు. అనంతరం రామ్ సుధీర్, లక్ష్మీపురం, నీలిపూడి, పెందుర్రు, కృత్తివెన్ను & బంటుమిల్లిలోని జనసేన నాయకులను, కార్యకర్తలను కలిసి పార్టీ బలోపేతం, నియోజకవర్గం సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పెడన జనసైనికులు, ఇంటి కిరణ్, కృష్ణ, యేళ్ళ కార్తిక్ బలరామ్, రామాంజనేయులు, ర్యాలీ సత్యనారాయణ, పుప్పాల సూర్యనారాయణ, ఏడుకొండలు, పాశం కృష్ణ, బుద్దాన బాబీ, ఈమని గణేష్, నరేష్, సయ్యద్ షఫీ, అశోక్, బాదం వినోద్, అంజిబాబు, మద్దాల పవన్ పాల్గోన్నారు.