శీనన్నసేన అనే వెబ్ సైట్ ప్రారంభించిన యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు బుధవారం వెబ్ డిజైనర్ కంచెం రామ్ ప్రసాద్ మరియు కుంచ నాగేష్ డిజైన్ చేసిన శీనన్నసేన వ్వ్వ్.సీనన్నసెన.ఇన్ అనే వెబ్ సైట్ ను రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ లో రాజంపేట నియోజకవర్గంలో యల్లటూరు శ్రీనివాస రాజు జనసేన పార్టీ కార్యక్రమాలు అన్నీ ఇందులో పొందుపరిచి ఉంటాయి. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, కడిమెళ్ల శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, కుళాయప్ప, ఆకుల చలపతి, నాసర్ఖాన్, రాజేష్ వర్మ, కె.ఆర్, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.