వైసీపీ, టీడీపీ ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి: జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటికరణ విషయంలో వైసీపీ, టీడీపీ ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” డిజిటల్ క్యాంపెయింగ్ లో భాగంగా ఆదివారం పలు మండలాల్లో #Raise_Placards_ANDHRA_MP నినాదంతో చేపట్టిన కార్యక్రమం పై ప్రజలకు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు వదిలి సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అలాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం ఆంధ్రులను అవమానపరచడమేనన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటికరణ విషయంలో వైసీపీ, టీడీపీ ఎంపీలు తమ స్వార్ధ ప్రయోజనాలు విడనాడి పార్లమెంట్ సమావేశాల్లో ప్లకార్డులను ప్రదర్శించి ఆంధ్రుల మనోభావాలను వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. నష్టాల పేరుతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తగదని, రాష్ట్రంలోని వైసీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఆంధ్రుల మనోభావాలను గుర్తించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓంకార్, భాస్కర్, సాయి, మోహన్, శివ రాజశేఖర్, భరత్, కోటి, సుభాష్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.