కలువపూలు గ్రామ వైసీపీ అభిమానులు వైసీపిని వీడి జనసేనలో చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, జి.మాడుగుల మండలం కలువపూలు గ్రామస్తులతో సమావేశమైన జనసేనపార్టీ నాయకులు. పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య గ్రామాన్ని సందర్శించి స్థానిక గ్రామస్తులతో పలు గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో మాకు రోడ్డు సమస్య ఆర్,ఓ.ఎఫ్,ఆర్ పట్టాలపై, త్రాగు నీటి సమస్యలు అధికంగా ఉందని తెలియజేసారు. మేము గత ఎన్నికల్లో మూకుమ్మడిగా వైసీపీ పార్టీకి అభిమానంతో ఓటు వేశామని కానీ మా సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవని తెలియజేసారు. డా.వంపూరు గంగులయ్య మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాలు సమస్యలకొలిమిలో ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రజల బ్రతుకులపై బుగ్గిజల్లిందన్నారు. ఇంకా ఇటువంటి అసమర్థ గిరిజన నాయకత్వాలపై అసమర్థ ప్రభుత్వాలపై సామాన్య గిరిజన జాతిప్రజలుగా మనం వాళ్ళు చేసే మోసాలను తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో రానున్న ఎలక్షన్లలో జనసేనపార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తుందని కచ్చితంగా పాడేరు నుంచి జనసేనపార్టీ గెలుస్తుందని మీరంతా సహకరించాలన్నారు. పవన్ కళ్యాణ్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రజాపాలన విషయాన్ని తెలియజేశారని, అతని అడుగుజాడల్లో గిరిజన యువత ఆలోచన చేస్తున్నారన్నారు. సిద్ధాంతాలతో పార్టీ నిర్మాణం చేపట్టారని అదే సిద్ధాంతాలు ఆశయాలతో రేపటి తరాలకు బావిష్యత్ నిచ్చే ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా వైసీపీ పార్టీ అభిమానులుగా ఉన్న కలువపూలు గ్రామస్తులు వైసీపిని వీడి జనసేనపార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా జనసేనపార్టీలో డా.గంగులయ్య ఆహ్వానించారు. ఈ సమావేశంలో సీదరి చందు, అశోక్, వి.సురేష్, సుబ్బారావు, మన్మధరావు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.