వైసిపి ప్రభుత్వం పంచాయతీలకు పంగనామాలు

పెడన, గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. గ్రామరాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు. ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, ఆంధ్రప్రదేశ్ రెండోది. 1959 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది. ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, వైసీపీ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను కూడా ప్రభుత్వం తీసుకోవడం దుర్మార్గం. 15వ ఆర్థిక సంఘం 2021-22 సంవత్సరానికి రెండో విడత ఇటీవల విడుదల చేసిన దాదాపు ₹. 948 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అయి 20-30 రోజులైనా పంచాయతీలకు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. తన కన్నాతల్లి లాంటి ఉన్న ఊరికి సేవ చేద్దామని ఎన్నికైన సర్పంచులకు నిరాశే ఎదురైంది. తొలిరోజుల్లో ఎన్నికైన సర్పంచులు తాము ఎన్నికైన తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కొన్ని పనులను తమ సొంత ఖర్చులతో పూర్తి చేశారు. కొందరు సర్పంచ్ అయితే అప్పు చేసి మరీ పనులు చేశారు. ఆ బిల్లులు రాక అనేక మంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. బానిసత్వంలో బతకడం కంటే స్వేచ్ఛ కోసం పోరాడుతూ ప్రాణాలు పోగొట్టుకోవడం ఉత్తమమని పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు అన్నారు.