క్రీడా స్పూర్తిని నింపుతున్న జనసేన

  • రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లి, వీరబల్లి మండలాల 11 క్రికెట్ టీమ్ లు క్రికెట్ మాచ్ లలో పాల్గొని క్రీడా స్పూర్తిని నింపారు.
  • విన్నర్స్ చిన్నగొల్లపల్లి మరియు రన్నర్స్ క్రిష్ణమయ్య పల్లె టీమ్ లకు అభినందనలు
  • మ్యాన్ ఆప్ ది సీరీశ్ గుగ్గిల్ల శివకుమార్ కు మరియు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ గొల్ల బాబు నాయుడికి ప్రత్యేక అభినందనలు
  • క్రీడలు ఐక్యత పెంపొందేందుకు దోహద పడతాయి

రాజంపేట, యువకులలో ఐక్యత పెంపొందేందుకు క్రీడలు దోహద పడతాయని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారక సమితి రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ నాయుడు(గుట్టబాబు) పేర్కొన్నారు, టి.సుండుపల్లి మండలంలోని చిన్న గొల్లపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు(గుట్టబాబు), జనసేన నాయకురాలు రెడ్డి రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుట్టబాబు మాట్లాడుతూ యువకులలో ఐక్యత కలిగి ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతాలు ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చెందడానికి వీలుంటుంది అన్నారు, చిన్నగోళ్లపల్లి గ్రామంలో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించేందుకు చేయూతను ఇస్తానన్నారు. జనసేన నాయకురాలు రెడ్డి రాణి మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి అని అన్నారు. యువకులు క్రీడాస్ఫూర్తి కలిగి ఉన్నప్పుడే ఐక్యత పెంపొందుతుంది అన్నారు. అనంతరం మొదట స్థానంలో నిలిచిన చిన్నగొల్లపల్లి జట్టుకు గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు(గుట్టబాబు) చేతులు మీదుగా రూపాయలు 10,016/-, అదేవిధంగా రన్నర్ గా నిలిచిన సానిపాయి జట్టుకు మలిశెట్టి వెంకట రమణ చేతుల మీదుగా రూపాయలు 5,016/- అందజేసారు. అలాగే ఈ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన శివకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట చిరంజీవి యూత్ అధ్యక్షుడు నాగార్జున, యండపల్లి టిడిపి యువ నాయకులు దుగ్గనపల్లి వెంకట రమణ రెడ్డి(బాబు) గురిగింజకుంట శ్రీనివాసులు నాయుడు, రెడ్డి మల్లప్ప నాయుడు, గుగ్గిళ్ల వెంకటేష్, గుగ్గిళ్ల శ్రీనివాసులు, సానిపాయి రెడ్డయ్య, కోటికె సుబ్బరామప్ప నాయుడు, పి.రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.