రైతుల కష్టాల పట్ల కనీస చిత్తశుద్ధిలేని ప్రభుత్వం వైసీపీ: జనసేన

గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలం జనసేన వ్యవసాయ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే ఈ ప్రభుత్వానికి కనీసం రైతుల పట్ల వారు పడుతున్న కష్టాలపై కనీస చిత్తశుద్ధి లేదని, ఈ ఏడాది మిర్చి పంట వేసిన వారిలో సుమారు 70 శాతం మంది రైతులు నష్టపోయిన వారేనని మీకు వారిపై ఏమాత్రం చిత్తశుద్ధి కనుక ఉంటే వెంటనే నష్ట పరిహారంగా 50000 ఇచ్చి రైతులను ఆదుకోవాలని తెలిపారు. మీరు రైతులకు నష్ట పరిహారం అందించని పక్ష్యంలో రైతు సంఘాలతో కలిసి వ్యవసాయ సంబంధిత కార్యాలయాల ముట్టడికి పిలుపును ఇస్తామని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మందపాటి దుర్గారావు, జిల్లా కార్యదర్శి అంబటి మళ్లీ, తక్కెళ్లపాడు సర్పంచ్ శానం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ, బత్తుల వెంకయ్య జనసేన నాయకులు తోట నాగేశ్వరరావు,నంబూరి మధు, కోట మధు, గురజాల నరసింహారావు, వేల్పుల చైతన్య, రుద్రాల అంజి జనసైనికులు పాల్గొన్నారు.