ప్రతి స్కామ్ మూలాల్లోనూ వైసీపీ నాయకులే: డా. గంగులయ్య

పాడేరు: జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్య మీడియా మిత్రులతో మాట్లాడుతూ గత సంవత్సరం స్మార్ట్ విలేజ్ వెల్ఫేర్ బారి స్కామ్ ని బహిర్గతం చేసాము సరిగ్గా వారం క్రితం విధ్యాంజలి 2.0 ఉద్యోగాలు నియామకాలు పేరున జరిగినటువంటి స్కామ్ ని బహిర్గతం చేసాము ప్రస్తుతం ఈ రోజు కోవిడ్-19 పేరున స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్ వంటి పోస్టులకి గాను 2019లో జరిగిన భారీ స్కామ్ బాధితులు ఈ రోజు మమ్మల్ని కలిసి మాకు న్యాయం చెయ్యండని విన్నవించుకున్నారు. ప్రతి స్కామ్ యొక్క మూలాలు పరిశీలిస్తే వైసీపీ నాయకులు ఉండడం వైసీపీ పార్టీ ప్రధాన లక్ష్యం ఏమిటో అర్ధమవుతుంది. కోవిడ్ 19 సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు గాని నిరుద్యోగుల దగ్గర ఒకొక్కరి నుంచి సుమారు లక్ష ఏభై వేల నుంచి 3లక్షల వరకు పాడేరు మండలం మినుములూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, మినుములు సత్యనారాయణ, వెంకటరమణ పాత్రుడు (మినుములూరు), కందుల విద్యాసాగర్(నర్సీపట్నం). అనువ్యక్తులు వసూలు చేసారు. గిరిజననిరుద్యోగులు వైసీపీ నాయకులు దోచుకోవడానికి కావాల్సిన గొప్ప ముడిసరుకు అయిపోయారు. ఇంకెన్ని స్కాములు చేస్తారు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారు ఇదంతా పెద్దస్థాయి నాయకులకు తెలియకుండా జరుగుతుందా? పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం. ఇదేనా వైసీపీ నాయకత్వం గిరిజన ప్రజలకు చేసే మేలు ఇప్పటికైనా గిరిజన ప్రజలు, నిరుద్యోగులు మేలుకోవాలి ఇలాంటి స్కాములు చేసే వాళ్ళని ఇలాంటి నాయకులని న్యాయస్థానానికి ఈడ్చుతాం. బాధితులకు న్యాయం చేసేందుకు అవసరమనుకుంటే న్యాయస్థానాలని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సందర్బంగా బాధితులతో కలిసి ఎస్.పి అఫీస్ నందు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాడేరు మండల అధ్యక్షులు, నందోలి మురళి కృష్ణ, పెదబయలు మండల అధ్యక్షులు పవన్, అశోక్ తదితర బాధితులు పాల్గొన్నారు.