పోరాటం అనే పదం ఉచ్చరించే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదు

  • ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వ్యాఖ్యల్ని ఖండించిన జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: జి. మాడుగుల, కొయ్యురు మండలం కొమ్మిక గ్రామంలో బుధవారం జరిగిన వైస్సార్సీపీ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వృత్తిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అభిమానం వేరు, సినిమా వేరు, రాజకీయాలువేరని అన్నారు. రాజకీయాలంటే పొరాటమన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జి.మాడుగుల మండల నాయకులు మాట్లాడుతూ నిజానికి పోరాటం అనే పదం కూడా ఉచ్చరించే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వ నేతలకు లేదని విమర్శించారు. అలా అనుకుంటే ఏ పోరాటం చేసారని మీ అధినేత ముఖ్యమంత్రి గౌరవ జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలు కూడు తిన్నారని?, ఏ ప్రజా పోరాటం చేసారని చర్లపల్లి ఊచలు లెక్కబెట్టారని?, ఏ పోరాటం చేసిన ఫలితంగా సీబీఐ 33 కేసులు వేసిందని?, నోరుందికదా ఏదీ మాట్లాడినా చెల్లుతుందనే భ్రమలో వైసీపీ నాయకులున్నారని ఇది 80 దశకం కాదని? గిరిజన ప్రజలు నిరంతరం ఎవరు ఏమిటో, ఎవరి రాజకీయ నీతి ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారన్నారు. ఆ మాటకొస్తే సినీ రంగంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తారలు రాజకీయలలో పెను మార్పులు తీసుకొచ్చిన విషయం బహుశా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారికి తెలియకపోవడం ఆ పార్టీ నేతలకుండే అర్ధరహిత జ్ఞానానికి నిదర్శనంగా చెప్పవచ్చని ఎద్దేవా చేశారు. నిజానికి పొరాటమంటే కేవలం పదాలు ఉచ్చరించినంత మాత్రాన సరిపోదని, అలా అనుకుంటే గిరిజన నిరుద్యోగుల కల్పతరువు లాంటి జీవో నెం3 విషయంలో సుప్రీం కోర్ట్ కొట్టివేస్తే మీ పోరాటం ఎక్కడికి పోయింది? గిరిజన హక్కులు, చట్టాలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ మీ పార్టీ నేతలే చేస్తుంటే మీ పోరాటమేది? గ్రామసీమల అభివృధ్ధికోసం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్ళిస్తే మీ పోరాటం ఎక్కడికి పోయింది? మౌళికసాధుపాయలు కల్పనలో మొట్టమొదటి అంశం రహదారి కల్పన ఇప్పటికి ఈ రహదారి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి డోలిమోతలతో గిరిజనం అవస్థలు పడుతుంటే మీరు అబ్బో చాలా బాగా పోరాటం చేసి సాధిస్తున్నారు! చివరికి ఆదివాసీ ఆత్మగౌరవం గిరిజన అస్తిత్వంపై చట్టసభల్లో ప్రభుత్వమే స్వయంగా అత్యాచారానికి ఒడిగడితే మీరు స్వయంగా సభలో ఉండి దిక్కులు చూసారు తప్పితే వ్యతిరేకంగా పోరాడారా?.. పొరటమనే పదానికి పూర్తి విరుద్ధమైన ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు కూడా పోరాట స్పూర్తితో ప్రజా సేవకోసం రాజకీయాలలో వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి వృత్తి, పోరాటం కోసం మీరు మాట్లాడటం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి అసంబద్ధ వ్యాఖ్యలతో మీరు ప్రజలకు ఏ సందేశం ఇచ్చినా చివరికి అది స్పష్టంగా మీకే చేటు తేవడం ఖాయమన్నారు. ఆ మాటకొస్తే వైసీపీ ప్రభుత్వంలో సినిరంగం నుంచి వచ్చి మంత్రులుగా వెలగబెట్టి మేము ఎస్టీలమా అన్నా వారు కూడా ఉన్నారు. మీరు ఆ విషయం మరిచినట్టున్నారు. గిరిజన ద్రోహం తలపెట్టే ప్రభుత్వానికి బానిసత్వం చేసే మీరు పొరటమనే పదం ఉచ్చరించడానికి కారణమేమిటో కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కోసం చెయ్యాల్సిన భజనలు, కొట్టాల్సిన తాళాలు బాగానే కోడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ఉపాధ్యక్షులు సాగేని ఈశ్వరరావు, కార్యనిర్వహన కమిటీ రమేష్ తాంగుల, అఖిల్, క్రాంత్, అశోక్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వ్యాఖ్యల్ని ఖండించారు.