కరుడుగట్టిన కఠినాత్ములుగా వైసీపీ నేతలు

  • ఆడబిడ్డలకు రక్షణ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
  • ముఖ్యమంత్రి పెదాల నుంచే నా బీసీలు నా యస్సిలు.. ఆయన గుండెల్లో నిండా ఆయన సామాజిక వర్గమే
  • రాజ్యాంగ వ్యవస్థలన్ని ముఖ్యమంత్రి కోసమే పనిచేస్తున్నట్లుంది
  • దిశా చట్టం దశా దిశా లేకుండా పోయింది
  • భవ్యశ్రీ మృతిపై ఇంతవరకు వాసిరెడ్డి పద్మ, తానేటి వనిత ఎందుకు స్పంధించలేదు
  • భవ్యశ్రీకి న్యాయం జరగాలంటూ సంపత్ నగర్ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేసిన జనసేన మహిళా నాయకురాలు పార్వతి నాయుడు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, పార్టీ శ్రేణులు

గుంటూరు: వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు కూడా వైసీపీ నేతల మనసుల్ని కదిలించలేకపోతున్నాయని, కరుడుగట్టిన కఠినాత్ములుగా వైసీపీ నేతలు మారారని జనసేన పార్టీ మహిళ కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరులో భవ్యశ్రీ అనే విద్యార్థి అత్యాచారానికి గురై హత్య గావించబడి పది రోజులు కావస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం అత్యంత హేయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భవ్యశ్రీకి న్యాయం చేయండి అంటూ శుక్రవారం శ్రీనివాసరావుతోటలోని రామనామక్షేత్రం సెంటర్లోని భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్వతి నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాట్లాడితే నా బీసీలు, నా యస్సిలు అంటూ గుండెలు బాదుకుంటాడని, వాస్తవానికి ఆయన గుండెల్లో రెడ్లకి తప్పా మరొకరికి చోటుండదని విమర్శించారు. ఒక బీసీ విద్యార్థిని చూడటానికి కూడా వీలులేని స్థితిలో హత్యకు గురైతే ముఖ్యమంత్రి కానీ మహిళా మంత్రులు కానీ ఎందుకు సందించటం లేదని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సతీమణి భారతిని సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారని శివాలెత్తిన మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఒక బీసీ వడ్డెర కులానికి చెందిన భవ్యశ్రీని అత్యంత పాశవికంగా హత్య చేస్తే ఏ కలుగులో దాక్కుందని ధ్వజమెత్తారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో హోమ్ శాఖ అనేది ఒకటుందా అని అనుమనమోస్తుందన్నారు. తానేటి వనిత తానొక హోమ్ మంత్రిని అన్న విషయాన్ని మరచిపోయిందని, ఎవరన్నా ఆమెకు ఒకసారి గుర్తు చేయాలని ఎద్దేవా చేశారు. మహిళలకు అన్యాయం జరిగితే గన్ కన్నా జగన్ ముందుంటాడు అంటూ అసెంబ్లీ సాక్షిగా డైలాగులు చెప్పిన రోజా సోషల్ మీడియాలో డాన్సులు చేసుకుంటూ, గుడ్ నైట్ లు చెప్పుకుంటుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మహిళలపై జరుగుతున్న అమానుష సంఘటనలపై ఇప్పటివరకు సీఎం కానీ హోమ్ మంత్రి కానీ చివరికి మహిళా మంత్రులు కానీ ఒక్క సమీక్షా సమావేశం పెట్టకపోవటం మహిళల భద్రత పట్ల ఈ వైసీపీ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియచేస్తుందన్నారు. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధించేందుకు మాత్రమే ఉపయోగించుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా భవ్యశ్రీ మృతిపై త్వరతిగతిన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఫాస్ట్ ట్రాక్ ద్వారా నిందితులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భవ్యశ్రీ తల్లిదండ్రులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో రెల్లి నేత సోమి ఉదయ్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, కదిరి సంజీవ్, కొలసాని బాలకృష్ణ, బాలు, ఫణి, బాలాజీ, నరసింహ, కాసులు, ప్రసాద్, రమేష్, స్టూడియో బాలకృష్ణ, తాడికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.