గన్నవరంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఈనెల 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహించే యువశక్తి బహిరంగ సభ పోస్టర్ కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సూచన మేరకు గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించడం జరిగింది. యువతకు ఉపాధి అవకాశాలు లేని ఈ వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బండ్రెడ్డి రవి, జిల్లా సెక్రెటరీ పంచకర్ల సురేష్, సంయుక్త కార్యదర్శి గంధం గోవర్ధన్, చిమటా రవివర్మ, గన్నవరం మండల అధ్యక్షులు పచ్చిపాల లక్ష్మణరావు, విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు, బాపులపాడు మండల అధ్యక్షులు వడ్డీ శివ నాగేశ్వరరావు, మండల నాయకులు భూక్య సమీర్, కొడిమెల రవి చింతజల్లు కుమారి, దుంపల సంధ్యారాణి, తోట నాగరాజు, ప్రేమ్ సాగర్, యర్రంశెట్టి బాబి. కోలవెన్ను నాని జనసేన నాయకులు, అడ్డగిరి రామకృష్ణ, గుంటుపల్లి హర్ష, మేకల స్వాతి, నీలం సాయిరంగారావు పాల్గొన్నారు.