చీరాల పట్టణ జనసేన యువత ఆధ్వర్యంలో “యువ శక్తి” పోస్టర్ విడుదల

ఉమ్మడి ప్రకాశం జిల్లా, చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున చీరాల పట్టణ యువ నాయకుడు గొర్ల రఘురాం ఆధ్వర్యంలో జనవరి 12 వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరుగుతున్న “యువశక్తి”( మన యువత మన భవిత) భారీ బహిరంగ సభకు సంబంధించిన గోడ పత్రికను మరియు బ్యానర్ను చీరాల పట్టణంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గొర్ల రఘు మాట్లాడుతూ ఈ సభకు హాజరయ్యి యువత తాము ఎదుర్కొంటున్న సమస్యల(చదువులు, స్థానిక ఉపాధి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పన చేయాలంటే స్థానికంగా ఏమి చేయాలి) గురించి పవన్ కళ్యాణ్ దగ్గర నివేదించే సదా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ యువ శక్తి కార్యక్రమానికి యువత భారీఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని చీరాల నియోజకవర్గ యువతను మరియు జనసేన సానుభూతిపరులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల పట్టణ జనసేన యువకులు ఇప్పిలి నాగరాజు, అక్కలపోతు శివాజీ, లంకా నరేంద్ర, లంకా రవి, పైలా భార్గవ్, కేంబురి వాసు, కడగల శివ శంకర్, మీసాల మురళి మరియు వావ్విలిపల్లి రవిలతో పాటు పట్టణ జనసైనికులు పాల్గొన్నారు.