ప్రమాద బాధితులను పరామర్శించిన బత్తుల దంపతులు

  • సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళాకారులకు భరోసా
  • 20,000 చొప్పున మొత్తం ఆరుగురికి 1,20,000 రూపాయలు ఆర్థిక సహాయం

రాజమహేంద్రవరం, గతవారం తునిలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై రాజమహేంద్రవరం సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన జానపద కళాకారులు సూరిశెట్టి అవతారం, కర్రి దుర్గాప్రసాద్, కర్రి నానాజీ, పెంటకోటి గణేష్, కాళ్ళ వీర వెంకట దుర్గాప్రసాద్, పెంటకోటి దుర్గాప్రసాద్ లను కలిసి పరామర్శించి ఆరోగ్య స్థితి గతులను తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు జనసేన నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. వారి చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికీ 20,000 చొప్పున మొత్తం ఆరుగురికి 1,20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనంతరం మీడియాతో బత్తుల మాట్లాడుతూ… అందరి కుటుంబంలో ఆనందాలు నింపే కాళాకారుల కుటుంబాలలో ఇంతటి విషాదం అలుముకోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని బత్తుల బలరామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరాం, బోయిన వెంకటేష్, వేగిశెట్టి రాజు నాతిపాము దొర, అరిగెల రామకృష్ణ, గంగిశెట్టి రాజేంద్ర, గాడాల జనసైనికులు, చిట్టిప్రోలు సత్తిబాబు, కమిడి సత్యనారాయణ, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అడబాల సత్యనారాయణ, కణుపూరు దొర, దేవన దుర్గాప్రసాద్ (డి.డి) మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

  • ఆకుల సాయిరాంకు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల దంపతులు
  • 20,000/- రూపాయలు ఆర్థికసాయం

కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ వాస్తవ్యుడు, జానపద కళాకారుడు ఆకుల సాయిరాం గతవారం తునిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి రాజమహేంద్రవరం, జిఎస్ఎల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ జిఎస్ఎల్ హాస్పిటల్ కి వెళ్లి సాయిరాంని కలిసి పరామర్శించారు. సాయిరాం కుటుంబానికి ధైర్యం చెప్పి సాయి తొందరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జనసైనికుల చేతుల మీదుగా 20,000 ఆర్ధిక సహాయాన్ని అందించి సాయిరాం ఆరోగ్య పరిస్థితిని బత్తుల బలరామకృష్ణ దంపతులు వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరాం, బోయిన వెంకటేష్, వేగిశెట్టి రాజు, నాతిపాము దొర, అరిగెల రామకృష్ణ, గంగిశెట్టి రాజేంద్ర, గాడాల జనసైనికులు, చిట్టిప్రోలు సత్తిబాబు, కమిడి సత్యనారాయణ, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అడబాల సత్యనారాయణ, కణుపూరు దొర, దేవన దుర్గాప్రసాద్ (డి.డి) మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

  • ప్రమాదంలో మృతిచెందిన దుర్గారావు, బుల్లియ్య మరియు వీరబాబు కుటుంబాలకు భరోసా
  • కుటుంబానికి రూపాయలు 50,000/- ఆర్థికసాయం

తునిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ వాస్తవ్యులు, జానపద కళాకారులు సూరిశెట్టి దుర్గారావు, ఆడారి బుల్లియ్య మరియు బీశెట్టి వీరబాబు కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు జనసేన నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. సోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు తమ సానుభూతిని వ్యక్తం చేసిన బత్తుల దంపతులు. అనంతరం సూరిశెట్టి దుర్గారావు, ఆడారి బుల్లియ్య మరియు బీశెట్టి వీరబాబులకు శ్రద్ధాంజలి ఘటించి ఇంటి మనిషిని కోల్పోయిన సూరిశెట్టి దుర్గారావు, ఆడారి బుల్లియ్య మరియు బీశెట్టి వీరబాబు కుటుంబాలకు యాభై వేల చొప్పున 3 కుటుంబాలకు రూపాయలు 1,50,000/- ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు‌. బత్తుల బలరామకృష్ణ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ.. వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులకు, అధికార పార్టీ నేతలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగపట్నం గ్రామ పెద్దలు దాడి శ్రీను, దాడి సీతయ్య, బొడ్డేటి అప్పలరాజు, పెనకటి బాబురావు, కొరిమిల్లి సాంబరావు మరియు శ్రీరంగపట్నం గ్రామ జనసేన నాయకులతో పాటు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరాం, బదిరెడ్డి దొర, బోయిన వెంకటేష్, వేగిశెట్టి రాజు నాతిపాము దొర, అరిగెల రామకృష్ణ, గంగిశెట్టి రాజేంద్ర, గాడాల జనసైనికులు, చిట్టిప్రోలు సత్తిబాబు, కమిడి సత్యనారాయణ, గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అడబాల సత్యనారాయణ, కణుపూరు దొర, దేవన దుర్గాప్రసాద్ (డి.డి) మరియు శ్రీరంగపట్నం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.