జే.ఎస్.పి గ్లోబల్ టీమ్ వీరమహిళల జూమ్ సమావేశం

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో శనివారం పలు దేశాలకు చెందిన జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ వీరమహిళలకు సంబంధించి ఆ టీమ్ సభ్యురాలు పద్మజ రామిశెట్టి అద్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా, యూ.ఏ.ఈ, జర్మనీ మరియు యూకే కు చెందిన వీరమహిళలు పాల్గొనడం జరిగింది. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో వీరమహిళలు ఒకరినొకరు పరిచయం చేసుకుని జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది. ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు యూ.ఏ.ఈ మరియు ఆస్ట్రేలియా వెళ్ళినపుడు వీరమహిళలను చూసి వారు పార్టీకి చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించడం జరిగిందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడమే ముఖ్యోద్దేశంగా సాగిన ఈ సమావేశంలో వీరమహిళలు అందరు వారి వారి అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే నినాదంతో మొట్ట మొదటిగా ఇంటిలో మరియు బంధువులలో జనసేన గురించి తెలియపరిచి వారిని జనసేనకు అనుకూలంగా మార్చి వారి ఓటు గాజు గ్లాసుకు పడే విధంగా చూడాలని, జనసేన పార్టీకి మీడియా సపోర్ట్ లేనందున తాము బలంగా ఉన్న సామాజిక మాద్యమాలలో మరింత ఉత్తేజంతో జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని మరింత బలంగా ఎప్పటికప్పుడు షేర్ చేయాలని, ప్రజలలో స్పూర్తిని నింపే విధంగా జనసేనాని చేస్తున్న ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను మరియు జనసేన పార్టీ తరపున జరుగుతున్న సేవా కార్యక్రమాలను వీడియోల రూపంలో చిత్రీకరించి వాటిని పూర్తిస్థాయిలో అందరికీ తెలిసే విధంగా ప్రయత్నించాలని, మౌత్ పబ్లిసిటీ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని కాబట్టి అందరూ విరివిగా జనసేన ప్రచారం చేయాలని, ఎన్నికల సమయంలో స్వదేశానికి వచ్చి జనసేన పార్టీ తరపున క్షేత్ర స్థాయిలో వీలైనంతమేరకు బలంగా ప్రచారం చేయాలని అన్నారు. జనసేన పార్టీ గెలుపును అడ్డుకునేందుకు అధికార పార్టీ చేసే ఓట్ల తొలగింపు కార్యక్రమాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అని, ప్రాధమిక హక్కు అయినటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని హరించే విధంగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఫేసుబుక్ లో జే.ఎస్.పి డోనర్స్ గ్రూపును క్రియేట్ చేయడం జరిగిందని ఆ గ్రూపు కేవలం జనసేనకు డొనేషన్స్ చేసే పోస్టులు మాత్రమే ఉంటాయని 100 నుండి 1000 దాటి ఎవరికి వేలైనంతలో వారు డొనేట్ చేయొచ్చని తెలిపారు. దాదాఫు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ఆస్ట్రేలియా నుండి హేమా నాయుడు, యూకే నుండి అమల చలమలశెట్టి, హిమవల్లి చలికొండ, పద్మజ రామిశెట్టి, యూ.ఏ.ఈ నుండి సునీత, లక్ష్మి రజిత కేసరి, కొడిమండ్ల లక్ష్మి, వారణాసి కృష్ణవేణి పత్తి, జర్మనీ నుండి ఉమా సబింకర్, ఇండియా నుండి రత్న పిల్లా మరియు ప్రభావతి వసంతాల తదితరులు పాల్గొన్నారు.