వరదబాధితులను పునరావాసాలకు తరలించాలని జనసేన డిమాండ్

రంపచోడవరం, పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మించిన కాపర్ డ్యాం వలన గోదావరి వరద నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లకపోవడం వలన వి.ఆర్ పురం మండలం లోని గ్రామాలు ముంపుకు గురై 40 రోజులు కావస్తుంది. 3వ సారి ముంపుకు గురైన రాజుపేట కాలనీ, వడ్డిగుడెం వి.ఆర్.పురం గ్రామాలలోని ఇండ్లు మరియు అడవిలో గుడారాలు వేసుకుని అంధకారంలో నివసిస్తున్న వరద బాధిత కుటుంబాలను మండల జనసేన నాయకులు సందర్శించారు. వచ్చిన వరదకు తల్లడిల్లిపోతున్న ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ఇంతవరకు నిత్యవసరాలు టర్పలిన్ లు ఇవ్వలేదని, తక్షణమే అందజేయాలని మరియు ముంపునకు గురయిన ప్రతి గ్రామానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి పునరావాసాలకు తరలించాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, బాగుల అంజనరావు,కోట్ల మోహన్ రెడ్డి, పెట్ట రాంబాబు, ముత్యాల దుర్గా ప్రసాద్(హ్యారీ) ముంజపు సాయి, దుర్గా ప్రసాద్, నాగేంద్ర, పెట్ట నాగు, సాగర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.