జనసేన ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన “రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి” అనే కార్యక్రమంలో భాగంగా 5వ రోజు పిఠాపురం పట్టణం 1వ వార్డ్ అగ్రహారంలో జరిగింది. స్థానిక కార్యకర్తలు, నాయకులు సహకారంతో శేషుకుమారి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరియు సమస్యల పరిష్కారానికై పవనన్నకు ఓటు వేసి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వలని కోరారు. స్థానిక ప్రజలు వారికి ఉన్న కుళాయి సమస్యలు, రోడ్డు, డ్రైనేజీ సమస్యలు వివరించి పరిష్కారం చేయమని విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిఠాపురం పట్టణం ఒకటో వార్డు అగ్రహారం ప్రాంతంలో సమస్యలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయని, వాటిని వెంటనే మున్సిపాలిటీ విభాగం, ప్రభుత్వం, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన జనసేన ప్రభుత్వం వస్తే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, జనసేన పార్టీ వ్యూహాలు కరపత్ర రూపంలో వారికి వివరించారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ గాజు గ్లాసుతో ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమనికి సహకరించిన పిఠాపురం పట్టణ కమిటీ సభ్యులకు, నియోజవర్గ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, పిఠాపురం పట్టణ ప్రెసిడెంట్ బుర్రా సూర్యప్రకాశరావు, అల్లం కిషోర్, పిట్టా చిన్న, వేల్పుల చక్రధర్, కసిరెడ్డి నాగేశ్వరరావు, పెద్దిరెడ్ల భీమేశ్వరరావు, అప్పన్న, మహేష్, నందు, నాగరాజు, గంజి సురేష్, బెల్లంకొండ బాబి, బావిశెట్టి వినయ్, పసుపులేటి గణేష్, బెల్లంకొండ వీరభద్రరావు, గోపు సురేష్, దేశిరెడ్డి సతీష్, దువ్వ వీరబాబు, కంద సోమరాజు, పట్టణ కమిటీ సభ్యులు జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.