సామాన్యుల సమస్యలపై జనసేన పార్టీ దృష్టి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, కమలాపురం పంచాయితీలో చల్మన్ నగర్ గ్రామంలో గిరిజన తెగకు చెందిన మడకం రవి కుటుంబ అవసరాల నిమిత్తం 10 సంవత్సరాల వయసులో ఉపాధి కోసం వెళ్ళాడు, లారీ క్లీనరుగా పనిచేస్తూ, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అవ్వటంతో కుడికాలు విరగడంతో కాలులో స్టీల్ రాడ్ వేసి ఇంటికి పంపించడం జరిగింది. స్వగ్రామం చేరుకున్న రవికి ఆధార్ కార్డు లేకపోవడంతో తదుపరి వైద్యం కోసం ఏ హాస్పిటల్ కి వెళ్లిన వైద్యం చేయమని డాక్టర్లు చెప్పడంతో, ఈ విషయం స్థానిక జనసేన నాయకులు గొల్ల వీరభద్రం దృష్టికి తీసుకురావడంతో మండలంలో ఉన్న ఆధార్ సెంటర్ కు తీసుకువెళ్లి దరఖాస్తు చేయించడం జరిగింది. ఈ విధంగా నెల రోజులు గడిచిన ఆధార్ కార్డు రాకపోవడంతో స్థానిక నాయకుడు ఆధార్ కాల్ సెంటర్కు 1947 కాల్ చేయడం జరిగింది. వారు మీ ఆధార్ కార్డు రిజెక్ట్ చేయబడింది అని చెప్పడంతో ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మరియు మాజీ మంత్రివర్యులు జలగం ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే, జలగం ప్రసాద్ వెంటనే స్పందించి ఎమ్మార్వోకి ఫోన్ చేసి మడకం రవి గురించి వివరించడం జరిగింది. ఎమ్మార్వో మడకం రవికి ఓటర్ గుర్తింపు కార్డు ఇచ్చి మరల అప్లై చేయమని చెప్పారు. రెండవ సారి కూడా ఆధార్ కార్డ్ రిజెక్ట్ అవడంతో గత ఆరు నెలలుగా అనుభవిస్తున్న బాధను తట్టుకోలేక ఆధార్ కార్డు కూడా రిజెక్ట్ అవడంతో మనస్థాపానికి గురైన మడకం రవి రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సమస్యపై జనసేన నాయకులు దృష్టి సారించి, ఈ విషయాన్ని ప్రజాదర్బార్ లోని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో, కలెక్టర్ స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడించి మడకం రవికి ఆధార్ కార్డు వచ్చే విధంగా చూడాలి అలాగే బాదుతుడికి ఆరోగ్యపరంగా ప్రభుత్వ వైద్య శాఖచర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. నా కుమారుని ఆరోగ్య సమస్యలపై స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినందుకు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని బాధితుడి తల్లి సంతోషం వ్యక్తం చేసింది. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ జిల్లా నాయకులు గొల్ల వీరభద్రం, గరిక రాంబాబు, మండల నాయకులు పొడిచేటి చెన్నారావు, కందుకూరి వినీత్ తదితరులు పాల్గొన్నారు.