ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగాలు

ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 230 పోస్టులను భర్తీచేస్తున్నది. అభ్యర్థులను ఆన్‌లైన్‌ రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తుంది.

మొత్తం పోస్టులు: 230

ఇందులో అసిస్టెంట్‌ ఇంజినీర్‌-200 (ఎలక్ట్రికల్ 90, మెకానికల్ 70, ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్ 40), అసిస్టెంట్‌ కెమిస్ట్‌ 30 చొప్పున పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: అసిస్టెంట్‌ ఇంజినీర్‌కు ఎలక్ట్రికల్‌ లేదా మెకానికల్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్‌ కెమిస్ట్‌ కోసం కెమిస్ట్రీలో పీజీ చేసి, 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపు వారై ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష. పరీక్ష 2 భాగాలుగా ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్ టెస్ట్‌, అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఉంటాయి. అభ్యర్థులు రెండు విభాగాల్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 10

వెబ్‌సైట్‌: ntpc.co.in