జనసేన తరఫున యువతకి వాలీబాల్ కిట్ పంపిణీ

మాడుగుల నియోజకవర్గం, కె. కోటపాడు, మండలం చౌడువాడ గ్రామ పంచాయతీలో మండల జనసేన పార్టీ నాయకులు కుంచా అంజిబాబు సమకూర్చిన వాలీబాల్ కిట్టును చౌడువాడ జనసేన నాయకులు మరపురెడ్డి శివ, నాగులపల్లి మల్లునాయుడు చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివ మాట్లాడుతూ జనసేన పార్టీ యువతను ప్రోత్సహిస్తుందని సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటుందని అలాగే కిట్టు అందజేసినటువంటి అంజిబాబుకి చౌడువాడ జనసేన టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.