రెడ్‌ అలెర్ట్‌ను ప్రకటించిన తమిళనాడు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. డిసెంబర్‌ 1 నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం నిన్న మరింత బలపడింది. వాయుగుండం ప్రభావంతో డిసెంబరు 2 న అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందుగానే తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయి రెడ్‌ అలెర్ట్‌ ను ప్రకటించింది.

వాయుగుండం ప్రభావంతో రేపు సముద్ర తీర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురవనుండగా.. ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఇది ‘బురేవి’ తుపానుగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెండు రోజుల ముందుగానే అధికారులు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.