తనకల్లు మండలం కొక్కంటీ క్రాస్ వద్ద జనసేన నిరసన

సత్యసాయి జిల్లా, కదిరి, గత మూడు రోజులు నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెహికల్స్ ను గుర్తుతెలియని అనుమానాస్పద వ్యక్తులు ఫాలో అవ్వడం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బందిని తిట్టడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని దుర్బాషలాడటంలాంటివి చేయడం మాకు ఎంతో బాధని కలిగిస్తున్నాయి. ఇలాంటి నీచమైన దుర్మార్గమైన పనులు ఇకనైనా మానేయండి కదిరి నియోజవర్గం తనకల్లు మండలం కొక్కంటీ క్రాస్ వద్ద జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తూ నిరసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కె.వి రమణ, మండల నాయకులు కొట్టి కుమార్, మైనార్టీ నాయకులు మస్తాన్, కాలేషా, బాలసముద్రం గ్రామ ఎంపీటీసీ అమర్, అనిల్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, శేషు, లక్ష్మన్న, బాగేపల్లి శ్రీనాథ్, కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగిందని సత్యసాయి జిల్లా కార్యక్రమాల నిర్వాహక కమిటీ సభ్యులు ఎస్.ఫయాజ్ తెలిపారు.