బ్రిటన్ రాజు ఫిలిప్స్ కన్నుమూత

లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్స్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ప్రిన్స్ ఫిలిప్స్ వయసు 99 ఏళ్లు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన కోలుకున్నారు. కానీ మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈరోజు మృతి చెందనట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 10న ప్రిన్స్ ఫిలిప్ 100వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రిన్స్ ఫిలిప్‌, క్వీన్ ఎలిజబెత్‌కు నలుగురు సంతానం. కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటి నుంచీ ఆయన క్వీన్‌తో కలిసి విండ్సర్ కాజిల్‌లోనే ఉంటున్నారు.

దేశంలోని సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తితో పాటు రాజ కుటుంబంలో కష్టపడి పనిచేసే సభ్యుల్లో ఒకరిగా ఫిలిప్ పేరు పొందారు. 1947లో అప్పటి యువరాణి ఎలిజబెత్‌ను ఫిలిప్స్ వివాహం చేసుకొన్నాడు.ఫిలిప్ రాణి ఎలిజబెత్ కు మద్దతుగా 65 ఏళ్లపాటు పనిచేశాడు. 2017లో ఆచయన తన ఆయన ఈ విధుల నుండి తప్పుకున్నారు. యువరాణి కింద రాచరికం కోసం ఆయన ఒక కొత్త కోర్సును ఏర్పాటు చేయడంలో సహాయపడ్డారు.