పేద కుటుంబానికి కె.ఆర్ యంగ్ ఇండియన్ ట్రస్ట్ ఆర్థిక భరోసా

నరవ గ్రామం, 88వ వార్డ్, పెందుర్తి నియోజకవర్గంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కీర్తిశేషులు ఇల్లపు శ్రీనివాస రావు కుటుంబాన్ని పరామర్శించిన కె.ఆర్ యంగ్ ఇండియన్ ట్రస్ట్ సభ్యులు, ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.ఆర్ అడ్మిన్ నవీన్ పెద్దమల్ల చేతుల మీదుగా 10 వేల ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ నరవ గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లపు శ్రీనివాస్ రావు గారు మరణించారనే విషయాన్ని స్థానిక అడ్మిన్ మాకు తెలియజేయగానే వెంటనే మా పెద్దలు శివ భాస్కరరావు గారికి తెలియజేసి, వారి ఆమోదంతో పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న దాతల సహకారంతో వారి కుటుంబాని పరామర్శించి 10 వేల ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగిందని, వారి సతీమణికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని స్థానిక ప్రజలు కోరడం జరిగిందని తప్పకుండా మా వంతు ఉద్యోగం వచ్చేలాగా కృషి చేస్తామని అన్నారు. స్థానిక అడ్మిన్ శ్రీకాంత్ మాట్లాడుతూ సమస్య ఎక్కడున్నా కె.ఆర్ అక్కడ ఉంటుందని, సామాన్య ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్న యంగ్ ఇండియన్ ట్రస్ట్ సహకారం అక్కడ ఉంటుందని మరొక్కసారి ఈ కార్యక్రమం రుజువు చేసిందని, అతి తక్కువ సమయంలోనే పెందుర్తి పరవాడ సబ్బవరం మండల వాట్సాప్ గ్రూపులో ఈ విషయాన్ని తెలియజేయగానే క్రౌడ్ ఫండింగ్ ద్వారా 10 వేలు రూపాయలు సమకూరిందని, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న దాతలందరూ ప్రత్యేక ధన్యవాదాలు, మమ్మల్ని నడిపిస్తున్న కె.ఆర్ ఫౌండర్ శ్రీ పెద్దిరెడ్డి శివ భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. గల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రజలకు కేఆర్ అండగా ఉంటుందని, ఎంతోమందికి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించబడ్డాయని దయచేసి శ్రీనివాస్ గారు సతీమణి గారు కూడా ఒక ఉద్యోగం ఇవ్వగలిగితే వారి మనుగడకు ఉపయోగపడుతుంది కె.ఆర్ సభ్యులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సభ్యులు గళ్ళ శ్రీనివాస్, గవర త్రిమూర్తులు, వబ్బిన జనార్థన శ్రీకాంత్, బొడ్డు నాయుడు, గవర శ్రీను, రాజేష్, దొరబాబు పాల్గొని కుటుంబాన్ని ఆదుకున్న కె.ఆర్ దాతలకు మరియు కె.ఆర్ ఫౌండర్ శ్రీ పెదిరెడ్డి శివ భాస్కర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.