విశాఖ డీఎంహెచ్‌వోలో 322 పోస్టులకు నోటిఫికేషన్

విశాఖపట్నం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీ చేపట్టారు. ఒప్పంద ప్రాతిపదికన విశాఖపట్నం జిల్లాలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ నర్సు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్‌, కన్సల్టెంట్‌, హాస్పిటల్ అంటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, సైకాలజిస్ట్‌, వార్డు క్లీనర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ పోస్టులకు ఈ దరఖాస్తు కాపీతో పాటు విద్యార్హతల జిరాక్స్‌లను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం నందు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్స్ http://visakhapatnam.ap.gov.in, http://visakhapatnam.nic.in ఉన్నాయి.

పోస్టుల ఆధారంగా.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో తగిన అనుభవం కలిగి ఉండాలి. మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

మొత్తం ఖాళీలు: 322

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.400, ఇతరులకు రూ.200

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: అక్టోబర్ 10

మెరిట్ జాబితా వెల్లడి, అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 15

 రిజర్వేషన్ల ఆధారంగా తుది మెరిట్ జాబితా అక్టోబర్ 17న విడుదల చేయనున్నారు. నియామక ఉత్తర్వులు అక్టోబర్ 19న జారీ అవుతాయి.

చిరునామా: DMHO, Visakhapatnam, AP. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం