ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దర్ కు జనసేన ఘన నివాళి

వనపర్తి నియోజకవర్గం: తెలంగాణ ప్రముఖ ప్రజా గాయకుడు, ఉద్యమ నాయకులు గద్దర్ అకాల మరణం కారణంగా సోమవారం వనపర్తి పట్టణ కేంద్రంలో జనసేన ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను కొనియాడారు. విప్లవ ప్రజా కళాకారుడు తెలంగాణ పోరాట పటిమలకు తన పాటల ద్వారా జీవం పోసిన గాయకుడు గద్దర్ గారు అస్తమించడం, అన్నింటిలో వెనకబడిన ఆశ జీవులకు తీరని లోటు అని జనసేన పార్టీ వనపర్తి జనసైనికుల నుండి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాహానుభూతిని తెలియజేశారు. ప్రజా సమస్య గొంతుకను అణచబడిన ఆశాయల నిరుపేద ఆశల ఆయుధాలను తయారు చేసుకొని పోరాటాలకు తనదైన శైలిలో తన పాటలతో పాలకుల గుండెల్లో గుబులుని ప్రజల గుండ్లెలో చైతన్యాన్ని నింపుతూ ప్రజా గాయకుడు గద్దర్ ను ఒక ప్రజా యుద్ద నౌకగా సూటిగా పోయేటటువంటి గద్దర్ గారు ఒక ఉద్యమ కారుడు చేసే గానం, ఉపన్యాసం గాని తన పని విధానం ద్వారా గాని అలా జీవిత కాలన్ని ఒక విప్లవ పోరాట పంథాలో ప్రజల కోసం తన గళాన్ని తన వాక్చాతుర్యాన్ని తన పాటల ద్వారా రక్తి కట్టించి ప్రజల్ని చైతన్యం చేసినటువంటి మహానుభావుడు ఆయనను తెలంగాణ ప్రజలు స్మరించుకుంటారని ఆశిస్తూ జోహార్లు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ అద్యక్షుడు సురేష్ యాదవ్, మండల అధ్యక్షుడు ఉత్తేజ్ , నాయకులు వెంకటేష్, శివ, నరసింహ, శరత్ తదితరులు పాల్గొన్నారు.