జీలుగుమిల్లిలో జనం కోసం జనసేన 100వ రోజు

పోలవరం: జీలుగుమిల్లి టౌన్ లో 100వ రోజు జనం కోసం జనసేన కార్యక్రమం మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. కార్యకర్తలు, వీరమహిళల నుంచి ఘన స్వాగతం లభించింది. హరతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిర్రి బాలరాజు మాట్లాడుతూ జీడిమల్లి నుంచి పాలచర్ల వెళ్ళు రహదారి ఇప్పటివరకు మరమ్మత్తులు కూడా చేయలేని పరిస్థితిలో అధికారం ఎమ్మెల్యే నాయకులు ఉన్నారని, అదే రహదారులు వెళుతున్న కనీస సిగ్గు కూడా రావడం లేదా అని ఏద్దేవా చేశారు. నియోజవర్గాల్లో తిరిగిన ప్రతిచోట ఎన్నో సమస్యలు ఉన్నాయని, అవి తీర్చకుండా ప్రజల్లోకి ఎలా ఓట్లు కోసం వెళ్తారు అని ప్రశ్నించారు. మీకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని అందరూ ధైర్యంగా ఉండి ముందుకు వచ్చి ఓటు వేయాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల2024 తర్వాత పోలవరం నియోజకవర్గంలో వైసిపి భూస్థాపితం చేస్తామని అన్నారు. మేనిఫెస్టోను వివరిస్తూ, పార్టీ అధికారంలోకి రాగానే చేయ సంక్షేమ పథకాలు వివరిస్తూ ఏదైనా కష్టం వస్తే మేమున్న మన హామీ ఇస్తూ ముందుకు సాగారు. వీరంకి వెంకటేశ్వరరావు, రూపా సత్యనారాయణ, కోలా మధు కుమార్, చిర్రి శ్రీనివాసరావు, బండారు అనిల్, నరేంద్ర, శివ, శాంతి కుమార్, శేఖర్, సాయి, కూరం వెంకటేశ్వరరావు, సోడిశెట్టి సుభాష్, మూర్తి, మల్లేష్, అమృతపల్లి రవి, కొమరం వెంకటేశ్వరావు, సింహాద్రి అప్పన దొర, పోసి తొమ్మిదేళ్ల వెంకటరత్నం, కిరణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.